బాలీవుడ్లోనే కాదు.. దేశవ్యాప్తంగా శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయనకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గళాలు దాదాపుగా లేవు. ఒకరిద్దరు బాధితులమని తెరముందుకు వస్తున్నారు కానీ.. ఎక్కువగా ఆయనకు మద్దతు లభిస్తోంది. పెద్ద సెలబ్రిటీలు సైలెంట్‌గా ఉంటున్నారు కానీ..స్పందిస్తున్న ఎక్కువ మంది రాజ్ కుంద్రా చేస్తోంది తప్పు కాదని.. బిజినెస్సేనని.. పోర్న్‌కి.. ఎరోటిక్ ఫిల్మ్స్‌కు తేడా చూడాలని అంటున్నారు. రాజ్ కుంద్రా పోర్న్ మూవీస్ తీయలేదని.. ఎరోటిక్ మూవీస్ మాత్రమే తీస్తున్నారని .. అంటున్నారు.
గెహనా వశిష్ట్ అనే నటి.. రాజ్ కుంద్రా తీసిన ఫిల్మ్స్‌ను చూసిన తర్వాతనే.. అవి పోర్నా.. ఎరోటికా మూవీసా అన్నదానిపై స్పష్టతకు రావాలని సూచిస్తోంది. అప్పుడే ఆయన నేరం చేసినట్లుగా నిర్ణయానికి రావొద్దని అంటోంది. మరో నటి రాఖీ సావంత్ కూడా రాజ్ కుంద్రాను సమర్థించారు. ఆయన బ్లాక్‌మెయిలింగ్ కు బలయ్యారని ఆరోపించారు. పాప్ స్టార్ మికా సింగ్ కూడా.. రాజ్ కుంద్రాకు మద్దతు ప్రకటించారు. తాను రాజ్ కుంద్రా యాప్ వీడియోస్ చూశానని.. అందులో కేసులు పెట్టేంత ఏమీ లేదని స్పష్టం చేశారు. రాజ్ కుంద్రా మంచి వ్యక్తి అని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.
నిజానికి బాలీవుడ్లో బాలాజీ టెలీఫిల్మ్స్ ఓనర్ ఏక్తాకపూర్.. ఎరోటికా మూవీస్‌కు పెట్టిందిప పేరుగాఉన్నారు. ఆమెకు ALT పేరుతో యాప్ కూడా ఉంది. అడల్ట్ కంటెంట్‌కు ఆ యాప్ ప్రసిద్ధి. అందులో బోలెడన్ని ఎరోటిక్ సీరిస్‌లు ఉంటాయి. రాజ్ కుంద్రా కూడా అలాంటి సీరిస్లే తీసి.. యాప్‌లో ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ అంశంపై గతంలో రాజ్ కుంద్రాపై నటి పూనంపాండే కూడా ఫిర్యాదుచేసింది. అయితే ఆమె … రాజ్ కుంద్రా యాప్‌లో నటించింది. ఆ లావాదేవీల్లో తేడాలు రావడంతో ఫిర్యాదు చేసిందికానీ.. తప్పుడు పనులు చేయిస్తున్నారని కాదు. రాజ్ కుంద్రాపై ఫిర్యాదుచేసిన వారిలో ఎక్కువ మంది ఆయనతో కలిసి పని చేసిన వారేనని అంటున్నారు.
మొత్తం మీద బాలీవుడ్లో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. ఎక్కువ మంది స్పందించడానికి సంశయిస్తున్నారు. కానీ.. ఈ వ్యవహారంలో తప్పు లేదని.. అది కూడా బిజినెస్సేనని సమర్థించకపోతే.. సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు తీసేటప్పుడు పోలీసులు రెయిడ్ చేసి కేసులు పెడతారన్న చర్చ నడుస్తోంది. దీంతో రాజ్ కుంద్రాకు మద్దతుగా బాలీవుడ్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.