మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. కానీ కేంద్రం కొత్తగా రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని కూడా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ విడదల చేసి వాటిని ఘనంగా ప్రకటించుకున్నారు మోదీ, అమిత్ షా. 1975లో జూన్ 25వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ తేదీని సంవిధాన్ హత్యా దివస్‌గా జరుపుతామన్నారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లకు పంపారు. మీడియా గొంతుకనూ అణచిపెట్టారు. ఈ చీకటి రోజుకి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అమిత్ షా చెప్పుకొచ్చారు.
అమిత్ షా ప్రకటనను రీట్వీట్ చేస్తూ..మోదీ గొప్ప నిర్ణయమని ప్రశంసించారు. ఎప్పుడో యాభై ఏళ్ల కిందట ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని బీజేపీ ప్రతి ఏడాది గుర్తు చేయాలని నిర్ణయించుకుంది. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహల్ పదే పేద చెబుతూండటం.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఆయన తిరుగుతూడండటంతో ఈ వ్యూహం పాటిస్తున్నారు.
అయితే అప్పట్లో ఇందిర ఎమర్జెన్సీలో ఏం జరిగిందో అనుభవించిన వాళ్లకే తెలుసు. ఇప్పుడు అలాంటి వారు వయో వృద్ధులైపోయారు. కొత్తగా రెండు తరాలకు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని విపక్షాలు చేసే ప్రచారాన్ని మాత్రం ప్రజలు ఎక్కువే నమ్ముతున్నారు. గతంలో జరిగిపోయిన దాని గురించి అదీ కూడా యాభై ఏళ్ల కిందట జరిగిపోయిన వాటిని చూపించి.. బీజేపీ ఎం లాభం పొందుతుందో కానీ.. రాజ్యాంగ హత్యా దినోత్సవం అన్నదే్ కాస్త వెరైటీగా అనిపిస్తోంది. దీన్ని దినం అనాలా.. దినోత్సవం అనాలా అన్నది పార్టీల వారీగా మారిపోతుంది.