జనవరిలోనే దేశ ప్రజలందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికి ఏ టీకాకు అత్యవసర అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. కేంద్రం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. దేశీయంగా తయారైన టీకానే… ప్రజలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మోడీ అలా ప్రకటించిన వెంటనే.. కేంద్రం ఇలా… డ్రై రన్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించింది. జనవరి 2 నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ జరగుతుంది. గత వారంలో 4 రాష్ట్రాల్లో మాత్రమే డ్రై రన్ నిర్వహించారు.
డ్రై రన్ తర్వాత వారం, పదిరోజుల్లో.. కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని.. చెబుతున్నారు. ఇప్పటికే .. వివిధ టీకా సంస్థలు… పెద్ద ఎత్తున టీకా డోసులు రెడీ చేసుకున్నాయి. అనుమతి వచ్చిన వెంటనే వాటిని పంపిణి చేస్తాయి. కరోనా సెకండ్ వేవ్ పేరుతో… స్ట్రెయిన్ చెలరేగిపోయే ప్రమాదం కనిపిస్తున్న సమయంలో… స్ట్రెయిన్‌ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ పని చేస్తుందని ప్రభుత్వం నమ్ముతున్నట్లుగా ఉంది. ఇప్పటికే రెండు నెలల నుంచి కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.
మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. వాటికి తగ్గట్లుగా ప్రిపేర్ కావాలని చెబుతోంది. ఇప్పుడు.. టీకాను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాకు.. ఒకటో తేదీన అత్యవసర అనుమతి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కూడా రేసులో ఉంది. స్వదేశీటీకానే పంపిణీ చేస్తామని మోడీ చెబుతున్నందున.. భారత్ బయోటెక్ టీకాకే ఎక్కువ ఆవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.