కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు:
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటి (సీసీఈఏ) ఈరోజు సమావేశమై ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం.
2018-19 కి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర క్యాబినెట్,వరి రైతులకు క్వింటాకు 200 రూపాయలు పెంచిన మోడీ ప్రభుత్వం.క్వింట 1,550 రూపాయలు ఉన్న వరి పంట ప్రస్తుత మద్దతు ధర 200 రూపాయలు పెంచగా 1750కి పెంచిన కేంద్ర ప్రభుత్వం, బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీని కట్టుబడి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.
రైతుల ఉత్పత్తి వ్యయంపై కనీసం 1.5 రెట్లు రైతులకు లబ్ది కల్పించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం .అత్యధికంగా రాగికి క్వింటాలకు 900 రూపాయలు పెంచి 2,700 రూపాయలకు సవరించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటి ,పంటల మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్.
వరి కనీసమద్దతు ధర క్వింటాకు 200 పెంపు
సన్ ప్లవర్ ధర క్వింటాకు 1288 పెంపు
పెసర్ల ధర క్వింటాకు 1400 పెంపు
రాగుల ధర క్వింటాకు 997 పెంపు
నిర్ణయం తో ప్రభుత్వం పై 15 వేల కోట్ల భారం పడనుంది.
నిన్న ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎంఎస్పీ వ్యవహారాలపై సమీక్ష.
మద్దతు ధరకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి ఆ స్కీం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని ప్రధానికి వివరించిన నీతి ఆయోగ్ వరి ,గోధుమ మినహా మిగిలిన పంటలకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర చెల్లించాలంటే ఏటా 12వేల కోట్ల నుంచి 15వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుందని ప్రధానికి చెప్పిన అధికారులు .