రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం రూ. 2వేల కోట్లను బాండ్లను అమ్మడం ద్వారా సమీకరించింది. రూ.1300 కోట్లు సేకరించేందుకు బాండ్లను విడుదల చేయగా… గంట వ్యవధిలోనే ఒకటిన్నర రెట్లు అదనంగా సబ్‌స్ర్కైబ్ అయ్యాయి. అంటే రూ.2వేల కోట్ల విలువైన బాండ్లు అమ్ముడయ్యాయి. తొలి ఐదేళ్లపాటు ఈ బాండ్లపై మారటోరియం ఉంటుంది. ఆ వ్యవధిలో మూడునెలలకోసారి వడ్డీ మాత్రం చెల్లిస్తారు. తర్వాత ఐదేళ్లలో అసలును వడ్డీతో కలిపి 3 మాసాలకోసారి మదుపుదారులకు చెల్లిస్తారు. సీఆర్డీయే జారీ చేసిన ఈ బాండ్లకు రాష్ట్రప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీగా ఉంటుంది. దేశంలో మరే స్థానిక సంస్థ బాండ్లకు ఇంత గొప్ప స్పందన రాలేదు.
అయితే ఈ ఈ బాండ్లపై యూపీ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ఆరోపమలు చేశారు. అభివృద్ధి పేరుతో అప్పులు తెచ్చి పార్టీ ఫండ్ గా మార్చేస్తున్నారని మమండిపడ్డారు. అమరావతి బాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. బాండ్ల వ్యవహారంలో కూడా అవినీతికి ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై.. కనీసం ఓ పదిహేను రోజుల పాటు జీవీఎల్ నరసింహారావు.. టీవీ చర్చల్లో హడావుడి చేశారు.
కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం.. బాండ్ల విడుదలను పొగిడింది. సీఆర్డీఏకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఏపీ సీఆర్డీఏకు కేంద్రం అభినందనలు తెలిపింది. క్యాపిటల్బాండ్లు విడుదల చేసి రూ. 2వేల కోట్లు సమీకరించినందుకు… ప్రొత్సహకంగా.. అమృత్ పథకం కింద రూ. 26 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని అభివృద్ధికి బాండ్లు విడుదల చేసి రూ. 2వేల కోట్లు సమీకరించడం…దేశంలోనే రికార్డ్‌గా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అభినందించింది. దీంతో.. భారతీయ జనతా పార్టీ నేతలు.. ఇంత కాలం చేస్తున్న ఆరోపణలు.. ఉత్త రాజకీయ పరమైనవేనని.. తేలిపోయింది. అయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకునే జీవీఎల్ ఈ విషయాన్ని అసలు పట్టించుకోరు.. రేపొచ్చి.. పాత ఆరోపణలే మళ్లీ చేస్తారు. చాలా కాలంగా అదే జరుగుతోంది.