ఉగ్రదాడి విషయంలో బీబీసీ చూపిస్తున్న వివక్షాపూరిత మీడియా కవరేజీపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఈ అంశంపై కేంద్రం సీరియస్గా బీబీసీకి ఓ లేఖ రాసింది. పెహల్గాం దాడి ఘటనలో పాక్ ప్రమేయం లేదన్నట్లుగా.. అదో మిలిటెంట్ ఎటాక్ మాత్రమేనని అన్నట్లుగా బీబీసీ వార్తలను ప్రసారం చేసింది. పాకిస్తాన్ కు చెందిన పలు చానళ్లను నిషేధిస్తూ.. బీబీసీకి మాత్రం నోటీసులు జారీ చేసింది.
బీబీసీ భారత వ్యతిరేక వైఖరి చాలా సార్లు విమర్శల పాలు అయింది. కశ్మీర్ విషయంలో బీబీసీ వైఖరి భిన్నంగా ఉంటుంది. అక్కడ తీవ్రవాద దాడులు ఏదో అంతర్యుద్ధంలో భాగంగా జరుగుతున్నాయని అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ భారత వ్యతిరేక వైఖరి విషయంలో గతంలోనే బీబీసీకి కేంద్రం గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. దాంతో బీబీసీ తన వార్తా సమాచార విభాగాన్ని ఔట్ సోర్స్ చేసింది.
బీబీసీలో పని చేసే వాళ్లందరితో ఓ కంపెనీ ఏర్పాటు చేయింది.. దాని కిందకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీ ఉద్యోగులు సేకరించి సమాచారన్ని బీబీసీలో పోస్టు చేస్తారు. నేరుగా బీబీసీకి సంబంధం లేకుండా.. ఈ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు బీబీసీపై కేంద్రం ఆగ్రహంతో.. ఆ సంస్థ తన ప్రసారాల విషయంలో మార్చుకుంటే సరి లేకపోతే.. నిషేధం విధించడమో.. ఆంక్షలు విధించడమో చేసే అవకాశం ఉంది.