అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ ఇవ్వనంత క్లారిటీ ఇస్తోంది. ఉదయం పార్లమెంట్లో విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు చట్ట ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పాటయిందని చాలా స్పష్టంగా చెప్పిన కేంద్రం.. తర్వాత సుప్రీంకోర్టులోనూ అదే విధంగా అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు అఫిడవిట్లో మరింత క్లారిటీ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారమే.. .. అమరావతి రాజధానిగా ఖరారయిదని ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసిది. గతంలో రాజధాని ఏపీ ప్రభుత్వ ఇష్టం అంటూకేంద్రం చెప్పేది కానీ ఇప్పుడు మాత్రం అమరావతి రాజధానికి మద్దతుగా ఉండేలా అఫిడవిట్లు దాఖలు చేస్తోంది.
ప్రభుత్వం అంటే ప్రభుత్వం. ఆ పార్టీ ప్రభుత్వం.. ఈ పార్టీ ప్రభుత్వం అనేవి ఉండవు. ఓ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు తర్వాత వచ్చే ప్రభుత్వం పాటించి తీరాలి. పాటించకపోతే.. .. ఆ నష్టాన్ని భరించాలి. కానీ ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అలాంటివేమీ పట్టవు. రాజ్యాంగం, చట్టాలు అన్నీ చెల్లవని అనుకుంటూ ఉంటుంది. ఆ ఫలితంగా ఇప్పుడు అమరావతి వివాదం ప్రారంభమైంది. మొదట్లో కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడారు. కానీ చివరికి వచ్చే సరికి కేంద్రానికి కూడా అర్థమైంది. అందుకే జగన్ ప్రభుత్వ పాపంలో భాగం పంచుకోకూడదని నిర్ణయించుకుంది.
సుప్రీంకోర్టులో ఇరవై మూడో తేదీన జరగనున్న విచారణలో.. కేంద్రం అఫిడవిట్ అత్యంత కీలకం. అసలు విషయం చెప్పకుండా.. రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిదంటూ… కొత్త వాదనతో అమరావతి తీర్పుపై స్టే కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ అలా హైకోర్టు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో…. న్యాయస్థానానికి స్పష్టత ఇచ్చేలా ఇటు పిటిషనర్లు.. అటు కేంద్రం కూడా సాక్ష్యాలను కేంద్రానికి సమర్పిస్తున్నారు. అమరావతి రైతులకు మొదటే అండగా నిలబడి ఉంటే పరిస్థితి ఇప్పటి వరకూ వచ్చేది కాదు… కానీ కేంద్రం ఇప్పటికైనా అండగా నిలబడే ప్రయత్నం చేయడం మాత్రం ఊరటనిచ్చేదే.