కేంద్రం దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌కు.. ఎప్పుడూ ప్రత్యేకహోదా ఉంటుందని… కేంద్రమంత్రులు తరచూ చెబుతూ ఉంటారు. రాజధాని లేకుండా భారీ లోటు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని తాము ఎప్పుడూ ప్రత్యేకంగా చూస్తామని చెబుతూంటారు. ఆ ఆక్రమంలో.. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చామని.. రూ. లక్షల కోట్ల లెక్కలు చెబుతూ ఉంటారు. కానీ అందులో అసలు నిజాలను పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ప్రకటించింది. ఈ లెక్కలు చూస్తే.. బీజేపీ మాటలకు – చేతలకు తేడా ఇట్టే తెలిసిపోతుంది.
ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చింది రూ. 15 కోట్లు..!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకు బదులుగా.. అంతకు మించిన ప్రయోజనాలతో.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో ప్రభుత్వం ఒకే అన్నది. అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం చేసి పంపింది. కానీ.. ఆ ప్యాకేజీ అమలు చేయడం లేదని.. వేరే నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ప్యాకేజీ నిధులు కుప్పులుతెప్పలుగా ఇచ్చామని.. ీబజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. ఆ కుప్పలు తెప్పలుగా.. మొత్తం కలిపితే రూ. 18 కోట్లు అని.. తేలిదింది. ఈ విషయం కేంద్రం ఆర్థిక శాఖ సహాయమంత్రి.. పార్లమెంట్‌కు తెలిపారు. రికార్డెడ్ డాక్యుమెంట్ల సహితంగా ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచారు. ఇదికూడా.. విదేశీ ఆర్థికసాయంతో చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఏపీ సర్కార్ చెల్లించిన వడ్డీ రీఎంబర్స్ మెంట్ మాత్రమే. ఇక ఎలాంటి ప్యాకేజీ నిధులూ ఇవ్వలేదు.
తెలంగాణకు రూ. 450 కోట్లు..!
ఏపీకి.. రూ. 15 కోట్లు ఇచ్చిన కేంద్రం.. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణకు మాత్రం రూ. 450 కోట్లు ఇచ్చినట్లు గొప్పగా ప్రకటించింది. చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.450 కోట్లు విడుదల చేశామని పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి.. అదే సమయంలో తెలంగాణకు ఎందుకివ్వలేకపోయారో చెప్పలేదు. ఇచ్చి మరీ వెనక్కి తీసుకున్న నిధుల విషయంలోనూ క్లారిటీ ఇవ్వలేదు.
నిధులన్నీ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకే..!
దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5,239 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ. 450 కోట్లు, ఏపీకి రూ. 15 కోట్లు పోతే.. మిగిలిన మొత్తం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకే ఇచ్చారు. త్రిపురకు రూ.1858.70 కోట్లు ఇచ్చారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అర్ధకుంభమేళా పనుల కోసం ఏకంగా రూ.1,200 కోట్లు ఇచ్చారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద బిహార్ కు రూ.739 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కోసం రూ.309 కోట్లు ఇచ్చారు. జమ్మూకశ్మీర్ కు రూ.285 కోట్లు, నాగాలాండ్ కు రూ.226 కోట్లు, రాజస్థాన్ కు రూ.146 కోట్లు, ఉత్తరాఖండ్ కు రూ.8 కోట్లు విడుదల చేశారు. కానీ మరే దక్షిణాది రాష్ట్రానికి .. ప్రత్యేకహోదా కోరుతున్న ఒడిషాకు కానీ.. బెంగాల్‌కు కానీ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.