స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారంటూ హడావుడి చేస్తున్న బీఆర్ఎస్కు షాకిచ్చేలా కేంద్రం ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర స్టీల్ శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టంగా ప్రకటంచారు. ఇప్పటికిప్పుడు ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనీ పక్రకటన చేశారు.
ప్రస్తుతానికి ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేసినట్లుగా చెప్పారు. ఈ అంశంపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అధికారులతో సమావేశం అవుతున్నామని, మరిన్ని విషయాలు చర్చిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయడానికి ప్రయత్నిస్తుండడం ఒక బూటకం మాత్రమేనని కొట్టిపారేశారు. బిడ్డింగ్‌లో పాల్గొనడం వారి పరిధిలోని విషయం అని స్పష్టం చేశారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ కు అవసరమన ముడిపదార్థల సరఫరా కోసం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెన్ట్ జారీ చేశారు. అందులో బిడ్డింగ్ వేస్తే.. స్టీల్ ప్లాంట్ చేతికి వచ్చినట్లేనని బీఆర్ఎస్ హడావుడి చేసింది. సింగరేణి అధికారుల్ని స్టీల్ ప్లాంట్ కు పంపి వివరాలు తెలుసుకుంది.
అయితే బిడ్డింగ్ దాఖలు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఒక వేళ బిడ్డింగ్ దాఖలు చేసి.. ఆ చాన్స్ వచ్చినా అది తెలంగాణ సర్కార్ కు రూ. ఐదు వేల కోట్ల వరకూ ఆర్థిక భ అవుతుంది కానీ ఒక్క శాతం కూడా యాజమాన్య హక్కులు వచ్చే అవకాశం ఉండదు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ రాజకీయాన్ని వీలైనంత వరకూ తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు.