కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త చట్టం తేవడానికి రంగం సిద్ధం చేసింది. ఇది నేరుగా ప్రజలకు సంబంధించినది కాదు. కానీ.. దీని వెనుక … ప్రధాన కారణం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయనను.. ఆయన కార్యకలాపాలను చూసి..ఇన్స్పైర్ అయి… ఈ చట్టం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ ఉన్న ట్విస్టేమిటంటే.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా చేయాలని.. ఆ చట్టం తేవడం లేదు… అలా చేయకూడదని.. ఇంకెవరూ చేసే అవకాశం ఇవ్వకూడదని చట్టం తెస్తున్నారు. అదే విదేశీ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించే చట్టం. ఇతర దేశాల నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టిన వారు… తమ పెట్టుబడులకు ప్రభుత్వాల నుంచి రక్షణ ఏది అని అడుగుతున్నారు. అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది.. అంటే.. జగన్మోహన్ రెడ్డి .. .విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పట్ల వ్యవహరిస్తున్న అంశాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలతో రూ. 40వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రిస్క్‌లోకి పెట్టారు. ఏపీ సర్కార్ నిర్ణయంతో.. విదేశీ పెట్టుబడిదగారులు.. అసలు ఇండియా వైపు చూడటమే మానేశారు. ఈ క్రమంలో.. వారందరిలో భరోసా నింపడానికి కేంద్రం కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. ఈ ప్రకారం.. మొదటి సారి.. విదేశీ పెట్టుబడులకు.. పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలాంటి ఒప్పందాలను.. రద్దు చేసుకునే అవకాశం లేదని… నిర్ధారిస్తూ.. చట్టం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే రెడీ చేశారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోద ముద్ర వేయించే అవకాశం కనిపిస్తోంది. కేవలం రాజకీయ కారణాలతో.. గత ప్రభుత్వం కుదుర్చుకుందన్న కారణంతోనో.. లేక.. తమకు సన్నిహితులైన వారికి ఆ ఒప్పందాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కానీ… జగన్మోహన్ రెడ్డి పీపీఏలను రద్దు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దీనికీ కూడా చట్టంతో చెక్ చెప్పబోతున్నారు. రద్దు చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది ఓ రకంగా… ఆరు నెలల్లో జగన్ సాధించిన విజయమే..!