పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్లో కలుపుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం కశ్మీర్ ఎన్నికలు జరుగుతూండటమే కాదు.. పీవోకేలో నెలకొన్న పరిస్థితులు కూడా. పాక్ ఆక్రమితకశ్మీర్ ను .. ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారుతోంది. మరో వైపు తాలిబన్లు పట్టు సాధిస్తున్నారు. తరచూ దాడులు జరుగుతున్నాయి. పాక్ సైన్యం నష్టపోతోంది.
తాలిబన్లకు గతంలో పాకిస్థాన్ ప్రోత్సాహం ఇచ్చింది. ఆఫ్ఘన్ ను వారు స్వాధీనం చేసుకోవడంలో సహకరించింది. ఇప్పుడు అది వారికి పెను సమస్యగా మారుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తే.. తాము చొరవ తీసుకుంటామని భారత ప్రభుత్వం సంకేతాలు పంపుతోంది. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రజలు భారత్ లో కలుస్తామని ముందుకు వస్తే… కలుపుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
భారత్ లో విలీనం అయితే.. భారత్ లో ఇతర ప్రాంతాల్ల ఎలా అభివృద్ధి జరిగిందో.. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచామో అలా పెంచుతామని హామీ ఇస్తున్నారు. పైగా పాకిస్థాన్ నిరాదరణ… చైనా ఎక్కువగా ఆక్రమణ చేస్తూండటంతో అక్కడి ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. భారత్ మాటలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజల్ని ఆకర్షిస్తే… కీలక మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు. బీజేపీ టార్గెట్లలో అత్యంత కీలకమైనది పీవోకేని కలుపుకోవడమే.