అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పాత లెక్కలు చెప్పాల్సిందేనని భీష్మించుకుని కూర్చుకుంది. అయితే కేంద్రం ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో అలాగే ఉంది. తెలంగాణతోనూ అలాగే ఉంది. మొదటి మూడు నెలల్లో ఆర్బీఐ నుంచి రూ. పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి పరిస్థితిుల్నిచక్క బెట్టుకుందామనుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో రూ. ఐదు వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లభించలేదు.
కేంద్రం ఎలాంటి అప్పులు ఇవ్వలేదు. దీంతో అవసరాల్ని .. చెల్లింపుల్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి.. తమ అప్పులు.. గ్యారంటీలు.. కార్పొరేషన్ల అప్పుల వివరాలన్నింటినీ కేంద్రానికి పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ దాటేసిందన్న అభిప్రాయం ఉంది. దీంతో రుణ పరిమితిలో కోత విధిస్తారని.. అందుకే ఇంకా అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఏపీకి ఇంకా దారుణంగా ఉంది.
తీసుకున్న అప్పుల వివరాలన్నీ చెబితే కేంద్రం ఈ ఏడాది అసలు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వదన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు అప్పులు రాకపోతే ఏంటి అనే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో వారు ఎలా ముందడుగు వేస్తారో కానీ.. కేంద్రం కరుణించకపోతే మాత్రం ఆర్థిక కష్టాలు తప్పవని భావిస్తున్నారు.