అదానీ వ్యాపారం పెద్ద స్కాం అని దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రపంచ కుబేరుడు అయినప్పుడు.. ఆయన కంపెనీలకు నిజ విలువ ఇప్పుడు షేర్ మార్కెట్లో ఉన్న విలువతో పోలిస్తే ఐదు శాతం కూడా ఉందని నిపుణులు తేల్చారు. ఆ గాలి బుడగ ఎప్పుడైనా పేలి పోవచ్చని ప్రకటించారు. కానీ చెవికెక్కించుకున్నవారు ఎవరూ లేరు. కానీ అదే అమెరికాకు చెందిన చిన్న సంస్థ పూర్తిగా పరిశోధించామని అందరికీ తెలిసిన విషయాలు చెబితే అప్పుడే తెలిసినట్లుగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అప్పులు తీసుకుని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, ట్రైన్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఇలా కనిపించినవన్నీ కొనేస్తూ పోయారు. చివరికి మీడియా సంస్థ ఎన్డీటీవీని కూడా కొనేశారు. వీటన్నింటిని కొనడానికి డబ్బులు ఉంటే చాలదు. వాటిని అమ్మేవారిని కూడా ఒప్పించాలి. దానికి మోదీ ఇతోధిక సాయం చేశారనే సాక్ష్యాలు బహిరంగంగానే ఉన్నాయి. ఎయిర్ పోర్టులు, పోర్టులు, మీడియా కంపెనీలు కొనడం వెనుక జరిగిన తతంగాల గురించి పైపైన తెలుసుకున్నా సినిమా అర్థమైపోతుంది.
అదానీ అనే మహా గాలి బుడగ సామ్రాజ్యం ఇలా ఎదిగిపోవడానికి కారణం రాజకీయమే. ఈ రాజకీయం వల్లనే ఇప్పుడు రిస్క్ వచ్చి పడింది. జరిగిన తప్పుల్ని కప్పి పుచ్చి అదానీని కాపాడాలని చూస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థకే ముప్పు వస్తుంది. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంది. మరి కేంద్రం ఏం చేస్తుంది.. ఆదానిని కాపాడటం కీలకం అనుకుంటుందా.. దేశ ఆర్థిక వ్యవస్థనా ?