కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మూడు పథకాలను ప్రకటించారు. ఉద్యోగ భవిష్య నిధి ఆధారంగా ఈ పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
ఉద్యోగంలో మొదటి సారి చేరిన వారిని ప్రోత్సహించేలా ఓ నెల వేతనం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒక్క రంగానికి మాత్రమే దీనిని పరిమితం చేయకుండా అన్ని రంగాలకు విస్తరింపజేస్తామన్నారు. గరిష్టంగా 15 వేలు అందిస్తామని.. వాటిని వాయిదా పద్దతిలో మూడు సార్లు చెల్లిస్తామన్నారు.
Also Read : ఇన్ కం ట్యాక్స్ శ్లాబ్ లో మార్పులు…
మేకిన్ ఇండియా లక్ష్యంగా రెండో పథకం ప్రవేశ పెట్టారు. ఉత్పత్తి రంగంలో ఉపాధిని క్రియేట్ చేయడమే ధ్యేయంగా ఈ పథకం తీసుకొచ్చారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వారితో పాటు యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహం అందివ్వనున్నారు. ఉద్యోగం కల్పించిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. దీనిని లక్ష వేతనం ఉన్న వారికి వర్తింపజేయనున్నారు.
అదనపు ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలను ప్రోత్సహించేలా రెండేళ్ళపాటు మూడు వేలు వరకు ఈపీఎఫ్ఓ రిజయింబర్స్ చేసేలా మూడో పథకం ఉండనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం వలన 50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అంచనా వేశారు.