రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని పరిశీలించాలని కృష్ణాబోర్డు కమిటీ పర్యటన ఖరారు చేసుకుని చివరి క్షణంలో ఆగిపోయింది. ఎన్జీటీతో పాటు కేంద్రం కూడా ఆదేశించినందున ఏపీ సర్కార్ సహకరిస్తుందని కేఆర్ఎంబీ అనుకుంది.కానీ ఏపీసర్కార్ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. రక్షణ కల్పిస్తామని కానీ.. ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు సహకరిస్తామని కానీ చెప్పలేదు. దాంతో కృష్ణాబోర్డు కమిటీ.. పర్యటనను వాయిదా వేసుకుంది. సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలతో… అక్కడుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి సమాచారం పంపారు. మూడో తేదీన కేంద్ర బలగాల రక్షణతో కృష్ణాబోర్డు.. . సీమ ఎత్తిపోతల ప్రాంతాల్ని పరిశీలించే అవకాశం ఉంది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వద్ద పనులేమీ జరగడం లేదని.. కేవలం సర్వే మాత్రమే చేస్తున్నారని ఏపీ సర్కార్ చెబుతోంది. అలాంటప్పుడు… కృష్ణాబోర్డు సిబ్బంది… సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలిస్తే.. ఏపీ సర్కార్కు వచ్చే నష్టం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. తెలంగాణ ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే అక్కడ పనులు జరుగుతున్నాయేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ కట్ట వద్దని.. ఇప్పటికే కృష్ణాబోర్డు ఆదేశించింది. ఎన్జీటీ స్టే ఇచ్చింది. అయినప్పటికీ కడితే అది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. అందుకే వీలైనంత వరకూ.. అ ప్రాంతానికి కృష్ణాబోర్డును రానివ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏపీ సర్కార్ తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కమిటీకి భద్రత కల్పించలేకపోవడం… కేంద్ర బలగాలతో వెళ్లాల్సి రావడంపై అన్ని వర్గాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ సర్కార్.. కోర్టుల్ని కూడా ధిక్కరిస్తూ.. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలుఉన్నాయి. ఈ సమయంలో కేంద్రాన్ని కూడా ధిక్కరిస్తుందన్న అభిప్రాయం..కృష్ణాబోర్డు కమిటీ పర్యటనకు ేస్తున్న అడ్డుపుల్లలు వేయడం ప్రభుత్వం నిజంగానే తప్పు చేస్తోందన్న అభిప్రాయం కలగడానికికారణం అవుతోంది.