ఏపీలోవరద పరిస్థితిని అంచనా వేయడానికి .. నష్టాన్ని లెక్కలేయడానికి కేంద్ర బృందం వచ్చింది. ముందుగా చీఫ్ సెక్రటరీతో సమావేశమయింది. తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 3 కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. ప్రభుత్వం తరపున వారికో నివేదిక అందిసతారు. అయితే ఇప్పటికి వరదలు వచ్చి .. వెళ్లిపోయి ఇరవై రోజులు అవుతోంది. దాదాపుగా సాధారణ స్థితి ఏర్పడింది. మునిగిపోయిన పంట.. నష్టపోయిన పంటను పొలాల నుంచి తొలగించి ఉంటారు. ఇప్పుడు నేరుగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుందన్న విమర్శ రైతు వర్గాల నుచి వస్తోంది.
సాధారణంగా వరద ఉద్ధృతి ఉన్నప్పుడే కేంద్రం ప్రత్యేక బృందాలను పంపి.. నష్టం అంచనా వేసి తక్షణ సాయం అందిస్తుంది. ఏపీ విషయంలో మాత్రం కేంద్రం చురుకుగా స్పందించలేదు. హైదరాబాద్కు కేంద్ర బృందాలను అప్పటికప్పుడు పంపారు. సాయం చేశారో లేదో… తర్వాతి సంగతి కనీసం.. అంచనాలను అయిన తెలుసుకున్నారు. ఏపీకి మాత్రం రెండు వారాల తర్వాత పంపారు. అదీ కూా.. తెలంగాణకు పంపారు.. ఏపీకి ఎందుకు పంపలేదన్న విమర్శలు రావడంతో.. బీజేపీ నేతలు ప్రత్యేకంగా కేంద్ర వ్యవసాయ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని.. విజ్ఞప్తి చేశారు. అప్పుడు ప్రకటన చేశారు. ఇప్పుడు బృందాలు వచ్చాయి.
రైతులకు ఏపీ సర్కార్ వైపు నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం ఇంత మొత్తం ఇస్తామన్న ప్రకటన కూడా చేయలేదు. ఇన్ పుట్ సబ్సిడీ వచ్చే నెలలో ఇస్తామని మాత్రమే చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం అయినా కనికరించి సాయం చేస్తుందన్న ఆశలో రైతులు ఉన్నారు. అయితే ఈ సమయంలో వరద నష్టం అంచనాకు వచ్చి.. నష్టం లేదు.. వరద ప్రభావం ఏమీ లేదనుకుంటే… నష్టపోతామని రైతులు భావిస్తున్నారు.