సార్వత్రిక ఎన్నికల సమయంలో న్యాయ్ పేరుతో నగదు బదిలీ పథకాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు లాక్ డౌన్ అనంతరం.. భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలన్నా…పేదల వద్ద డబ్బులు ఉండాలన్నా… ఆ పథకమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఆర్థిక వేత్తలతో ముఖాముఖి మాట్లాడుతన్న రాహుల్ గాంధీ…ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత .. కాంగ్రెస్ పార్టీ విధాన పరంగా..న్యాయ్ పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. వలస కార్మికులు, పేదలకు డబ్బు అవసరమని, అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల కి వెంటనే నిధులు అవసరమని తెలిపారు.
ముందుచూపు లేకపోతే ఉద్యోగాల కొరత సునామీ అవుతుందని రాహుల్ చెబుతున్నారు. వెంటనే.. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయాలని అంటున్నారు. అయితే.. అధికార పార్టీ దీనికి భిన్నంగా కౌంటర్ ఇచ్చింది. తాము ప్రజలకు నగదు బదిలీ చేస్తున్నామని ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియదా అన్నట్లుగా ప్రశ్నించింది. కేంద్రం .. లక్షా 70వేల కోట్ల రూపాయల ప్యాకేజీని గతలో ప్రకటిచింది. ఇందులో బియ్యం, గోధుమలు,పప్పులను.. ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు జన్ థన్ ఖాతాలున్న మహిళలకు నెలకు రూ. ఐదు వందలు చొప్పున మూడు నెలలు జమ చేస్తున్ారు. దీన్నే నగదు బదిలీగా కేంద్రం చెబుతోంది.కానీ రాహుల్ మాత్రం నెలకు రూ.7,500 పంపిణీ చేయాలని కోరుతున్నారు.
రాహుల్ గాంథీ చేస్తున్న సూచనలు.. బీజేపీ సర్కార్ కు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. తర్వాత వాటిని పాటించాల్సి వస్తూండటమే దీనికి కారణం. చైనా పెట్టుబడులు.. వలస కూలీల విషయంలో రాహుల్ సూచనలు చేసిన తర్వాత కేంద్రం స్పందించింది. ఇప్పుడు.. నగదు బదిలీ పథకంపై ఏం చేస్తుందో చూడాలి..!