కేంద్ర బీజేపీ నేతలకు తమ నేతల కన్నా జగన్ రెడ్డి ఇమేజ్ కాపాడటమే ముఖ్యం అని మరోసారి తేలిపోయింది. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులన్నింటినీ లెక్కలు వేసి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రజల ముందు పెట్టారు. అన్ని రుణాలు కలిపి దాదాపుగా రూ. పది లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారని.. ఇక ముందు అక్రమ అప్పులు తీసుకోనీయవద్దని ఢిల్లీ వెళ్లి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. ఇంత చేసినా ఏపీ అప్పులు ఎంత అంటే… వైసీపీ వాదించే లెక్కను మాత్రమే పార్లమెంట్లో చెప్పారు. పూర్తి వివరాలు చెప్పలేదు.
టీడీపీ దిగిపోయే నాటికి అంటే 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్ల అప్పు ఉంటే ఈ ఏడాది 3 మా అవి రూ.4,42,442 కోట్లకు చేరాయని పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే అప్పులు రూ. 1 లక్షా 70వేల కోట్లుకు కాస్త ఎక్కువ అన్నట్లుగా చెప్పారు. ఈ లెక్క కేంద్రానికి కాదు. రాష్ట్ర బడ్జెట్లోని లెక్కల ఆధారంగా రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక. ఈ రుణాలన్నీ ఆర్బీఐ నుంచి తీసుకున్నవే. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులను దాచేశారు. ఈ లెక్కలు చెప్పడంలేదంటూ నాలుగేళ్లుగా ‘కాగ్’ పేర్కొంటోంది. ఈ సమాచారం సేకరించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది.
ఏపీ అప్పులపై తీవ్ర వివాదం ఏర్పడుతున్నా. కార్పొరేషన్ అప్పుల లెక్కలను రాష్ట్రం చూపించలేదు. పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో కేంద్రం నుంచి అప్పుల విషయంలో తప్పుడు సమాచారం .. అరకొర సమాచారం బయటకు పంపి… వైసీపీకి మేలు చేశారు. ఇప్పుడు వారు బీజేపీ నేతల్ని కార్నర్ చేస్తున్నారు. పురందేశ్వరి చెప్పింది కరెక్టా… నిర్మలా సీతారామన్ చెప్పింది కరెక్టా అని ప్రశ్నిస్తున్నా రు. ఇది ఏపీ బీజేపీ నేతలకు అవమానమే. హైకమాండ్ ఇలా తమను జగన్ రెడ్డి ముందు ఘోరంగా అవమానిస్తూండటాన్ని బీజేపీ నేతలు ఎలా తీసుకుంటారో ?