భారత్‌లో పబ్జీ వీడియో గేమ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఓ వైపు చైనా సరిహద్దుల్లో అలజడి రేపుతూండటంతో మరో వైపు సరిహద్దులతో పాటు… చైనీస్ కంపెనీలపైనా..సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకంది. అందుకే.. పబ్జీతో పాటు మరో 118 చైనీస్ మొబైల్ అప్లికేషన్స్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ సారి ఆ జాబితాలోకి పబ్జీ చేరింది.
ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధం జాబితాలో అలీ ఎక్స్‌ప్రెస్, లూడో లాంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరిస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. చైనాలో సర్వర్లు ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం ఏ సమాచారాన్ని అయినా తీసుకునేలా చైనా 2017లో చట్టం చేసింది.దీంతో ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై డ్రాగన్ నియంత్రణలో ఉంటోంది. అక్కడి నుంచి సమాచారం తస్కరిస్తున్నారని కేంద్రం గుర్తించింది.
ఈ సారి నిషేధించిన యాప్‌ల జాబితాలో వీపీఎన్‌లు కూడా ఉన్నాయి. టిక్ టాక్ వీపీఎన్‌ను బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో చైనాకు చెందిన లక్షలాది యాప్‌లు ఉన్నాయి. వాటిలో భారత్‌లో ఎక్కువ వినియోగంలో ఉన్నవి చూసి.. భారత ప్రభుత్వం నిషేధఘిస్తోంది. చైనాను దారిలోకి తీసుకురావాలంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది. ఇండియాలానే ఇతర దేశాలు కూడా..చైనీస్ యాప్స్‌ను నిషేధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.