ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి లేఖ అందింది.. కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. మీడియాలో వచ్చిన వార్తలతో.. దీనిపై సమాచారం చెప్పాలంటూ.. గుడిపాటి నీరజ్ కుమార్ అనే వ్యక్తి.. సమాచార హక్కు చట్టం కింద…దరఖాస్తు చేసుకున్నారు. దానికి స్పందించిన కేంద్ర హోంశాఖ.. వెంటనే రిప్లయి ఇచ్చింది. భద్రత కోసం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి లేఖ వచ్చిందని.. దాన్ని తదుపరి చర్యల కోసం ఫార్వార్డ్ చేశామని స్పష్టం చేశారు. ఆ లేఖ సారాంశాన్ని తాము పోస్టు ద్వారా పంపుతామని.. నీరజ్కుమార్కు కేంద్ర హోంశాఖ తెలిపింది. దీంతో.. ఈసీ రాసినలేఖ ఫేక్ అంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అబద్దమని తేలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీఎస్ఈసీ …నిమ్మగడ్డ రమేష్ కమార్.. ఆరు పేజీలతో ఏపీలో ఎన్నికలు జరిగిన విధానాన్ని.. అధికార యంత్రాంగం.. నిర్లిప్తంగా ఉన్న వైనం.. పాలకుల కక్ష సాధింపు చర్యలు.. తనపై జరిగుతున్న వ్యక్తిగత దాడుల అంశాలన్నిటినీ వివరిస్తూ.. ఓ ఆరు పేజీల లేఖను.. కేంద్ర హోంశాఖరు రాసినట్లుగా బుధవారం సాయంత్రం నుంచి మీడియాలో ప్రచారం అయింది. అయితే.. తర్వాత కొన్ని మీడియా చానళ్లు.. అలా తాను లేఖ రాయలేదని.. రమేష్ కుమార్ చెప్పినట్లుగా వార్తలు ప్రసారం చేశాయి. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.
తాను రాశానని కానీ.. రాయలేదని కానీ ఆయన చెప్పలేదు. దీంతో అదో రాజకీయ ఇష్యూ అయిపోయింది. అయితే ఈ క్రమంలో… సీఆర్పీఎఫ్ బలగాలు.. ఎస్ఈసీకి రక్షణ కల్పించడానికి వచ్చాయి. దీంతో కేంద్రానికి లేఖ అందిన మాట నిజమేనని.. తేలింది. ఇప్పుడు.. నీరజ్ కుమార్ అనే వ్యక్తికి ఆర్టీఐలో దాన్ని అధికారికంగా చెప్పినట్లయింది. ఇప్పుడు ఈ లేఖ పరిణామాలు ఎలా ఉంటాయో.. అన్నదే కీలకంగా మారింది.
Here is the confirmation from Ministry of Home Affairs via RTI regarding the letter written by the SEC, Andhra Pradesh (Nimmagadda Ramesh Kumar). I shall upload the photos of the copy once the post is delivered to me.
Note: CRPF security cover has been provided for Ramesh today. pic.twitter.com/P57gmWvZGA— Neeraj Kumar (@NeerajK_G) March 19, 2020