ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి వద్ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ కేంద్రప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మకమయిన ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరి వద్ద 193ఎకరాలను కేటాయించింది. కేంద్రప్రభుత్వం నుండి క్లియరెన్స్ వచ్చేసింది కనుక దీనికి కూడా ఈనెల 22నే రాజధాని అమరావతితో బాటు ప్రధాని నరేంద్ర మోడీ చేత శంఖుస్థాపన చేయించి, వీలయినంత త్వరగా దాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో బాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖలో ఐ.ఐ.ఎం., మంగళగిరిలో ఎయిమ్స్, చిత్తూరులో ఐ.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్., తాడేపల్లి గూడెంలో ఎన్.ఐ.టి. వంటి ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అన్ని అనుమతులు మంజూరు చేసింది.వీటన్నిటికీ శాశ్విత భవనాలు నిర్మించేలోగా ఎంపికచేసిన తాత్కాలిక భవన సముదాయాలలో ఈ విద్యాసంవత్సరం నుండే శిక్షణా తరగతులు మొదలు పెడుతున్నారు.