వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకహోదా ఢిల్లీ వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉంటా. ఎప్పుడో ఒక సారి ఇస్తారనే ఆశాభావాన్ని మొదట్లో వ్యక్తం చేశారు. అన్నట్లుగా.. ఢిల్లీ వెళ్లినప్పుడుల్లా.. తాను.. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతున్నానని మీడియాకు చెబుతున్నారు. ప్రధానితో భేటీ అయినా… హోంమంత్రితో భేటీ అయినా.. ముఖ్యమంత్రుల సమావేశం అయినా… ప్రత్యేకహోదా కోసం గట్టిగా నినదించామని.. వైసీపీ నేతలు.. మీడియాకు చెబుతూంటారు. ఏపీ ప్రజలు అంతా నిజమేనని అనుకుంటూ ఉన్నారు. కానీ.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏపీ సర్కార్ నుంచి.. ప్రత్యేకహోదా కోరుతూ.. ఒక్కటంటే.. ఒక్క ప్రతిపాదన కూడా రాలేదట.
ఈ విషయం పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా బయటకు వచ్చింది. దీంతో..ఆశ్చర్యపోవడం.. ఏపీ రాజకీయవర్గాల వంతు అయింది. ఈ విషయాన్ని.. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మరింత సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి లేఖలు అందలేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని..దీనిపై ప్రభుత్వం స్పందించాలని అంటున్నారు. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ నిర్మోహమాటంగా చెబుతోంది. అయితే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం. ప్రత్యేకహోదా అంశాన్ని రెండు, మూడు నెలల పాటు మీడియాలో హైలెట్ చేశారు.
బీజేపీ అగ్రనాయకత్వం కన్నెర్ర చేసేసరికి.. ఆ తర్వాత ప్రత్యేకహోదా గురించి మాట్లాడటం లేదు. అయితే.. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కలిసినప్పుడు మాత్రం… జగన్ మీడియా ప్రత్యేకంగా.. మీడియాకు సమాచారం పంపుతుంది. అందులో ప్రత్యేకహోదా అంశం ఉంటుంది. అయితే ఇప్పుడు.. అలాంటి అడగడాలు ఏమీ లేవని.. కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. అధికారికంగా అడగడానికి.. జగన్ ఇచ్చే వినతి పత్రాలకు తేడా ఉందేమోనన్న సందేహాలు.. రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.