తెలంగాణాకి నాలుగు సెజ్ లు మంజూరు

కేంద్రం నుండి సహాయం పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు పూర్తి భిన్నమయిన విధానాలు అవలంభిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై ఎల్లప్పుడూ కత్తులు దూస్తూనే, కేంద్రం నుండి రావలసిన నిధులు, ప్రాజెక్టులు వంటివన్నీ రప్పించుకొంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడితో చాలా వినియంగా మసులుకొంటూ, కేంద్రమంత్రులు అందరితో స్నేహంగా మెలుగుతూ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు వగైరా సాధించుకొంటున్నారు. సామ,దాన,బేధ,దండోపాయాలలో చంద్రబాబు నాయుడు సామోపాయంతో ముందుకు సాగుతుంటే, కేసీఆర్ దండోపాయంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై కత్తులు నూరుతున్నప్పటికీ స్వయంగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా తన కొడుకు కె.టి.ఆర్., కూతురు కవిత, పార్టీ నేతల చేత తీవ్ర విమర్శలు చేయిస్తుంటారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పుడప్పుడు మెచ్చుకొంటూ పట్టువిడుపులు ప్రదర్శిస్తూ కేంద్రం నుండి సహాయాన్ని రాబట్టుకొంటున్నారు. ఉదాహరణకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రెండు లక్షల ఇళ్ళు, తెలంగాణాకి కేవలం పదివేల ఇళ్ళే మంజూరు చేసినప్పుడు, తెలంగాణా పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని గట్టిగా విమర్శలు గుప్పించి మళ్ళీ మరికొన్ని ఇళ్ళు సాధించుకొన్నారు.

అలాగే “ప్రధాని నరేంద్ర మోడి ఎప్పుడూ విదేశాలలోనే తిరుగుతారు తప్ప తెలంగాణా ఏర్పడిన తరువాత ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదు,” అని కె.టి.ఆర్. పదేపదే విమర్శలు చేసేసరికి ‘మిషన్ కాకతీయ పైలాన్’ ఆవిష్కరణకు వచ్చే నెల మోడీ రాక తప్పడం లేదు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలున్నాయి. కేసీఆర్ వ్యవహార శైలి ఇంచుమించు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శైలిలోనే సాగుతోందని చెప్పవచ్చును. ఆమె కూడా అవకాశం చిక్కినపుడల్లా కేంద్రప్రభుత్వ చెయ్యి మెలిపెడుతూ తన పనులు చక్కబెట్టుకొంటుంటారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం ఏవిధంగా సానుకూలంగా స్పందిస్తుంటుందో, కేసీఆర్ ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అలాగే వ్యవహరిస్తుండటం చూడవచ్చు.

అందుకు తాజా ఉదాహారణగా కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి ఈరోజు ఒకేసారి నాలుగు సెజ్ లు మంజూరు చేసింది. మెదక్ జిల్లాలో నేషనల్ ఇన్వెష్ట్ మెంట్ అండ్ మానిఫ్యాక్చర్ జోన్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పరిధిలో మూడు ఫార్మా నిమ్జ్ లకు కేంద్రప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అలాగే పాశమైలారంలో పాడి ప్రోసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు, మరో మూడు సెజ్ ల ఏర్పాటుకు త్వరలో లైన్ క్లియర్ చేయబోతున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మంజూరు చేసిన ఈ నాలుగు సెజ్ ల ద్వారా సుమారు రూ.17,500 కోట్ల పెట్టుబడులతో అనేక కొత్త పరిశ్రమలు వస్తాయని వాటి ద్వారా సుమారు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆమె తెలిపారు.

‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’అనే సామెతని కొంచెం సవరించుకొని ‘గట్టిగా అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు,’ అని చెప్పుకోవాలేమో. మరి చంద్రబాబు నాయుడుకి మోడీని ఇంత గట్టిగా దైర్యం ఉందా? అంటే అనుమానమే. పోనీ తన పద్దతిలోనే మోడీని బ్రతిమాలుకొనయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులు, రాజధానికి అవసరమయిన నిధులు సమకూర్చుకొంటే ఎవరూ తప్పు పట్టరు. కానీ కేసీఆర్ లాగ గట్టిగా అడగలేక, అలాగని బ్రతిమాలుకొని పనులు సాధించుకోలేక రాష్ట్రానికి అన్యాయం చేస్తే చివరికి తెదేపా కూడా నష్టపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close