ఇప్పటి వరకూ 50 శాతం ఆక్యుపెన్సీతోనే సరిపెట్టుకున్నాయి థియేటర్లు. సంక్రాంతికైనా 100 శాతం సిట్టింగ్ కి ఛాన్స్ ఉంటుందనుకుంటే, కేంద్రం అనుమతి ఇవ్వలేదు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ.. జారీ చేసిన ప్రకటనని కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసింది. అయితే.. ఇప్పుడు కేంద్రమే… థియేటర్లో సిట్టింగ్ కెపాసిటీ పెంచుకునే అవకాశం ఇచ్చింది. కొద్ది సేపటి క్రితం కొత్త కొవిడ్ మార్గ దర్శకాల్ని విడుదల చేసింది కేంద్రం. దీని ప్రకారం.. థియేటర్లలో ఆక్యుపెన్సీ శాతం పెంచింది. అయితే అది ఎంత వరకూ అనేది ఇంకా తెలీలేదు. 50 నుంచి 75 శాతానికి ఈ ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వొచ్చు. 100 శాతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొత్త మార్గ దర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. 75 శాతానికి పెంచినా.. చిత్రసీమకు మేలు చేకూరడం ఖాయం. ఈ ఫిబ్రవరి, మార్చిలలో… కొత్త సినిమాలు మూకుమ్మడిగా వస్తున్నాయి. వేసవికి… ఇక థియేటర్లు మోత మోగడం ఖాయం.