మహమ్మారి ర్యాపిడ్ టెస్టులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. లక్ష మందికి టెస్టులు చేయాల్న లక్ష్యం పెట్టుకుంది. అలా చేస్తే.. వైరస్ ఎంత మేర వ్యాప్తి చెందిందో తెలుసుకునే అవకాశం ఉంది. అందుకే దక్షిణ కొరియా నుంచి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఏపీకి వచ్చాయి. ప్రత్యేక విమానంలో అవి వచ్చిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆవిష్కరణ తర్వాత కిట్లను.. మొదటగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రయోగించారు. ఆయన బ్లడ్ శాంపిల్ తీసుకుని… టెస్ట్ చేశారు. పది నిమిషాల్లో నెగెటివ్ అని వచ్చింది. ఆయన ఒక్కరికే కాదు.. కొంత మంది ఉన్నతాధికారులు కూడా.. టెస్టులు చేయించుకున్నారు. అయితే.. ముఖ్యమంత్రికి టెస్ట్ చేసిన విషయాన్ని ఫోటోలు , వీడియోలు తీసి మీడియాకు విడుదల చేశారు. అయితే.. ర్యాపిడ్ టెస్టుల మార్గదర్శకాలు మాత్రం… వేరేగా ఉన్నాయి.
కానీ.. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే.. నెగెటివ్‌గా నిర్ధారించలేమని.. కేంద్రం చెబుతోంది. కరోనా ర్యాపిడ్ టెస్టుల ద్వారా…వైరస్ పాజిటివ్ లేదా నెగెటివ్ నిర్ధారించడం సాధ్యం కాదని.. అక్కడ పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను ఖచ్చితంగా ఐసీఎంఆర్ నిర్ధారించిన ల్యాబుల్లోనే టెస్టు చేసి.. ఖరారు చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతే కాదు.. ఇలా ఎవరికి పడితే.. వారికి టెస్టులు చేయకూడదని కూడా.. కేంద్రం స్పష్టం చేస్తోంది. వైరస్ భిన్నమైనది. మనిషి శరీరంలోకి సోకినా లక్షణాలు బయటపడటం లేదు. ఒక్కొక్కరిలో నెల రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయి. టెస్టులు చేసినా.. మొదట్లో నెగెటివ్ అనే వస్తోంది. ఈ కారణంగా ఐసీఎంల్ ప్రత్యేకంగా కొన్ని నియమనిబంధనలు విధించింది.
దాన్ని ఫాలో అవ్వకుండా.. సింపుల్‌గా మధుమేహ పరీక్ష చేసినట్లుగా.. ముఖ్యమంత్రికి టెస్ట్ చేసి.. నెగెటివ్ అని ప్రకటించేసి.. మీడియాకు సమాచారం ఇచ్చేశారు. ఇదే అయితే.. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలోనూ ట్రోల్ అయ్యారు. గతంలో జగన్.. టెస్టుల్లో నెగెటివ్ రాగానే.. కోవిడ్ ఆస్పత్రికి తరలించాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు ఆయనకు నెగెటివ్ వచ్చిందని.. ఏ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారని.. సోషల్ మీడియాలో.. కొంత మంది ట్రోల్ చేయడం ప్రారంభించారు.