ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్‌గా… ముందస్తు నియామకం రెడీ అయినా… సీనియర్ ఐపీఎస్ అధికారి.. స్టీఫెన్ రవీంద్రకు కాలం కలసి రావడం లేదు. ఆయనను.. డిప్యూటేషన్‌పై.. ఏపీకి పంపడానికి కేంద్రం ససేమిరా అంటోంది. ఆయనకు సంబంధించిన ఫైల్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. అయితే.. పూర్తిగా తిరస్కరించలేదు. తిరస్కరిస్తే.. స్టీఫెన్ తెలంగాణలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ.. ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు.. తనకు ఇంటలిజెన్స్ చీఫ్ పోస్ట్ వస్తుందని… స్టీఫెన్ ఎంతో ఆశగా ఉన్నారు. ఆయన … గత నెల రోజులుగా.. తెలంగాణలో తన ఉద్యోగానికి సెలవు పెట్టి.. ఏపీ అధికారులతో టచ్‌లో ఉన్నారు. కానీ పని మాత్రం జరగడం లేదు.
ఐపీఎస్ అధికారులను.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డిప్యూటేషన్ పై పంపాలంటే… కొన్ని నిబంధనలు ఉంటాయి. వాళ్లు.. సివిల్ సర్వీస్ రూల్స్‌లో ఉంటారు కాబట్టి.. ఆ నిబంధనలు పాటించాల్సిందే. కేంద్రం అనుమతిస్తేనే.. ఏదైనా సాధ్యం. ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వంతో.. సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. కేంద్రం.. స్టీఫెన్ ఫైలును పక్కన పెట్టడం ఆశ్చర్యకరంగానే కనిపిస్తోంది. అయితే.. జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రధానితో మాట్లాడితేనే.. పనవుతుందన్న ప్రచారం.. ఢిల్లీలో జరుగుతోంది. ఈ మేరకు.. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు వీలయితే.. అప్పుడు ప్రధానితో మాట్లాడితే.. స్టీఫెన్ ఏపీకి వస్తారంటున్నారు. మొదటగా.. కేసీఆర్‌ను అడిగింది కూడా.. జగనే కాబట్టి.. ప్రధానిని అడగడానికి కూడా ఇబ్బందులు ఏమీ ఉండవని అంచనా వేస్తున్నారు.
అయితే.. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వ్యవహారం కూడా.. సందేహంగా మారింది. ఆమె ఫైలు అసలు.. ఢిల్లీ వరకూ వెళ్లిందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆమెను ఏపీకి తీసుకొచ్చి.. కీలక బాధ్యతలు ఇవ్వాలని జగన్ అనుకున్నారన్న ప్రచారం జరిగింది. ఆమె వచ్చి జగన్‌తో సమావేశమయ్యారు కూడా. తర్వాత అంతా సైలెంటయిపోయారు. మరి జగన్ ఒక్కసారే ఇద్దరి బాధ్యతను తీసుకుని… తీసుకొస్తారో లేకపోతే.. కేంద్రంతో ఎందుకనుకుంటారో..?