చైనాతో నేరుగా సంబంధం ఉన్న యాప్‌లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా.. చైనాలో సర్వర్లను పెట్టుకున్న .. యాప్‌లపైనా దృష్టి పెట్టింది. ఇందులో వీడియో గేమింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పబ్జీపై కూడా.. కేంద్రం కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. టిక్‌టాక్‌తో సమానంగా పబ్ జీకి ఆదరణ ఉంది. వీడియో గేమింగ్ యాప్ కావడం.. యువతను విపరీతంగా ఆకర్షించింది. కొంత మంది ప్రముఖులు కూడా.. ఈ గేమ్ ఆడనిదే నిద్రపోరన్న ప్రచారం ఉంది. చాలా మంది విద్యార్థులు.. ఈ గేమ్‌కు బానిసలుగా మారి.. మానసికంగా స్థిరత్వం కోల్పోవడం… చదువుల్లో వెనుకబడటం వంటి సమస్యలు వస్తున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా ఉన్నాయి. టిక్‌టాక్‌ను నిషేధించినప్పుడు.. పబ్జీని ఎప్పుడు నిషేధిస్తారన్న ప్రశ్నలు కేంద్రానికి వచ్చాయి.
ప్రస్తుతం… చైనా ఎలాంటి యాప్‌ల ద్వారా సమాచారాన్ని సంగ్రహిస్తుందో తెలుసుకునేందుకు.. కేంద్రం ప్రయత్నిస్తోంది. చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌ల జాబితాను బయటకు తీసింది. 280 యాప్‌ల నుంచి చైనా సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా గుర్తించారు. ఇతర దేశాల్లో తమ కంపెనీలను రిజిస్టర్ చేసినప్పటికీ.. చాలా యాప్ కంపెనీలు.. తమ సర్వర్లను చైనాలో పెడుతున్నాయి. చైనా ప్రభుత్వం.. మూడేళ్ల కిందట ఓ చట్టం తెచ్చింది. చైనాలో ఉన్న సర్వర్లను… ఎలాంటి అనుమతి లేకుండానే… యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించుకుంది. జూమ్ యాప్‌పై ప్రధానంగా ఆరోపణలు రావడానికి ఇదే కారణం. జూమ్ యాప్ .. చైనీయులదే కానీ అమెరికాలో రిజిస్టరయింది. కానీ సర్వర్లు మాత్రం.. చైనాలో ఉన్నాయి. అందుకే దాన్ని ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
జూమ్ తరహా లోనే అనేక యాప్‌లు.. చైనాలో సర్వర్లు పెట్టుకున్నాయి. ఆ సర్వర్ల సమాచారాన్ని చైనా సులువుగా యాక్సెస్ చేస్తోంది. ఫలితంగా.. భారతీయుల సమాచారం.. అంతా చైనాకు చేరుతోంది. ఇలాంటి యాప్‌లను సుమారు 280 యాప్‌లను గుర్తించి నిఘా పెట్టారు. ఆయా యాప్‌ల ద్వారా డేటా ఎలా మారుతుందో సమాచారం సమాచారం సేకరించారు. ఏ క్షణమైనా.. కొత్త నిషేధిత యాప్‌ల జాబితాను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.