ప్రత్యేకహోదాను ముగిసిన అధ్యాయం అని చెబుతున్న కేంద్రం మరోసారి అదే అంశాన్ని చర్చల్లోకి తెచ్చింది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ 17వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సమావేశం వర్చువల్గా జరుగుతుంది. ఇందులో చర్చించడానికి మొత్తం 9 అంశాలుంటే ఎనిమిదో అంశంగా ప్రత్యేకహోదాను చేర్చారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఆగిపోయినఉమ్మడి సంస్థలు.. డబ్బుల పంపిణీపై చర్చించనున్నారు.
ఏపీ ఫైనాన్స్ కొర్పొరేషన్ విభజన, విద్యుత్ సంస్థల్లో నగదు అంశం, వనరుల సర్దుబాటు, పన్ను ప్రోత్సాహకాలు, విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల పంపకాలు వంటి వాటిపై చర్చించనున్నారు. దా అనేది ముగిసిన అధ్యాయం అని అంటూ కేంద్రం లోని పెద్దలు అనేక సార్లు తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్రమే ప్రత్యేకహోదాపై చర్చలకు రావాలని ఇరు రాష్ట్రలకు ఆహ్వానం పంపడం ఆసకక్తిరమే. ఏపీ ప్రత్యేక హోదా ఏపీలో ఇప్పటికీ రాజకీయ పరమైన అంశమే.
ఏపీకి హోదా ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని సీఎం జగన్ చెప్పారు. ఇటీవల విజయసాయిరెడ్డి రాజ్యసభలో కూడా అడిగారు. అయితే ఏపీ ప్రభఉత్వం ఆ అంశాలపై వినతి పత్రాలు ఇచ్చింది కాబట్టి చర్చించేందుకు ఎజెండాలో పెట్టారని కానీ ఎలాంటి ముందడుగు ఉండదని కొంత మంది అంచనా వేస్తున్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమేనని సమావేశంలో అదే చెబుతారని అంటున్నారు.