వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ప్రమాద ఘటనలో కేంద్రం శరవేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గంటల్లోనే రంగంలోకి దిగాయి. తెల్లవారు జాముకల్లా ప్రమాద తీవ్రతపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం వెళ్లింది. దేశంలో గతంలో ఇలాంటి దుర్ఘటనలు ఉండటంతో.. శరవేగంగా స్పందించింది. పుణె నుంచి ఎన్డీఆర్ఎఫ్ను పంపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ.. నేరుగా డీజీపీ,సీఎస్తో టచ్లోకి వచ్చింది. అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి.. ఎల్జీ పాలిమర్స్ సంస్థ చుట్టూ ఐదు గ్రామాల్లో ప్రతీ ఇంటిని సోదాచేసి…. ఆ ఇళ్లలో ఉండేవారి పరిస్థితిని తెలుసుకోవాలని డిసైడయింది.
ఎన్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోనూ.. ఇంటింటిని పరిశీలించారు. అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంత మంది అప్పటికీ అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మొత్తం దుర్ఘటన.. సహాయ కార్యక్రమాల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించారు. హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ కేంద్రమమంత్రి విశాఖ ఘటనపై.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం వైపు విపత్తలు నిర్వహణ శాఖ సహా… అందుబాటులో ఉన్న ప్రతీ వ్యవస్థ శరవేగంగా స్పందించడంతో.. చాలా వరకు ప్రాణ నష్టం తగ్గిందని భావిస్తున్నారు.
సాధారణంగా… ఇలాంటివి జాతీయ విషాదంగానే పరిగణిస్తారు. విశాఖ .. కేంద్ర సంస్థలు ఉన్న కీలకమైన నగరం కావడంతోనే… కేంద్రం శరవేగంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఆర్ఎఫ్ కూడా.. తోడవడంతో.. త్వరిగతిన సహాయ చర్యలు చేపట్టారు.