నాగచైతన్య – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘రారండోయ్ వేడుక చూద్దాం` అనే టైటిల్ ఫిక్స్ చేసేశారు. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసేశారు. ఈ టైటిల్ గత వారం రోజులుగా టాలీవుడ్లో చక్కర్లుకొడుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ సినిమా కోసమా, చైతూ సినిమా కోసమా అనే సందిగ్థం నెలకొంది. ఆఖరికి చైతూ సినిమాకే ఈ టైటిల్ ఫిక్సయిపోయింది.
”ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ ఎండ్ వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లానింగ్ జరుగుతోంది. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో మరో భారీ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. నాగచైతన్య కెరీర్లో ఇది ఓ మెమరబుల్ మూవీ అవుతుంది. దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్న చిత్రమిది. కమర్షియల్‌గా డెఫినెట్‌గా చాలా మంచి సినిమా అవుతుంది అంటున్నాడు దర్శకుడు.