పవన్ అంటే నితిన్‌కి పిచ్చి.. నితిన్ అంటే పవన్‌కి అభిమానం. అందుకే.. నితిన్ ఎప్పుడు పిలిచినా… ఆ వేడుకకు పవన్ వస్తాడు. అదే… ఆ సినిమాలో తన భాగస్వామ్యం ఉంటే… రావడం తథ్యం. ఇప్పుడూ అదే జగరబోతోంది. నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. ఈసినిమాకి శ్రేష్ట్ మీడియాతో పాటు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 4నే ఈ సినిమా వస్తోంది. ప్రమోషన్లు కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. ఆడియో విడుదల చేయడానికి చిత్రబృందం రెడీ అయిపోయింది. కానీ… ఒక్కటే ఇబ్బంది. పవన్డేట్లు సర్దుబాటు కావాలి. పవన్ ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ ఆడియో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పవన్… జనసేన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే పవన్‌ని డిస్ట్రబ్ చేయడం నితిన్‌కి ఇష్టం లేదు. ఆడియో వేడుకకు పవన్ రాకపోయినా.. ప్రీ రిలీజ్ వేడుక అయినా… పవన్‌తో జరిపించాలని భావిస్తున్నాడు. ఈ రెండు కార్యక్రమాల్లో ఒకదానికి పవన్ రావడం ఫిక్స్. అది… పవన్ ఇచ్చిన టైమ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. నితిన్, మేఘా ఆకాష్‌లు నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. త్రివిక్రమ్ కథ అందించారు.