బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. సినీ తారలు, రాజకీయ నాయకులు, పోలీస్ ఆఫీసర్లు, క్రీడా కారులు, శాస్త్రవేత్తలు… బయోపిక్‌లలో భాగం అవుతున్నారు. ఇప్పుడు రచయితల వంతు రాబోతోంది. సుప్రసిద్ధ రచయిత.. చలం బయోపిక్ తెరకెక్కించడానికి తెలుగులో ప్రయత్నాలు మొదలయ్యాయి. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి మేటి చిత్రాలకు రచన అందించిన భారవి.. చలం బయోపిక్ రెడీ చేశారు ఈ పాత్ర కోసం ఎంఎం కీరవాణిని సంప్రదిస్తే… ఆయన ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు మరో నటుడి కోసం అన్వేషణ సాగుతోంది.
తెలుగు సాహిత్యంలో చలం చిరస్మరణీయుడు. ఆయన అభ్యుదయ భావాలు, స్త్రీ పాత్రల్ని సృష్టించిన విధానం.. ఇవన్నీ అప్పట్లో సంచలనం సృష్టించాయి. మైదానం నవల అయితే.. నభూతో. చలం మ్యూజింగ్స్ అత్యంత పాఠకాదరణ పొందాయి. ఇప్పటికీ చలం బుక్స్ హాట్ కేకులే.చలం నవలల్ని వెండి తెరపైకి తీసుకొస్తున్నారు కూడా. ఇప్పుడు చలం బయోపిక్కే రాబోతోంది. చూద్దాం.. ఈ పాత్ర ఎవరు చేస్తారో?