చలపతిరావు.. తెలుగు తెరపై 40 ఇయర్స్ ఇండ్రస్ట్రీ అని చెప్పుకోదగిన ఎక్స్పీరియన్స్ ఉందీయనకు. అయితే… అనుభవం తెచ్చిన హుందాదనం ఏం కనిపించదాయనలో. ఎప్పుడు మైకు పట్టుకొన్నా – బూతుల భాండాగారాంలోకి టికెట్ లేకుండా ఎంట్రీ దొరికేసినట్టే అనిపిస్తుంది. ‘పెద్దాయన’లా ప్రవర్తించకుండా ఇంకా ట్వంటీ ట్వంటీ కుర్రాడిలా నాటీ నాటీ మాటలు మాట్లాడేస్తుంటాడు. వివాదాల్లో ఇరుక్కొంటుంటాడు. ఈ మధ్య నోరు జారిన పాపానికి మహిళా సంఘాలంతా రెచ్చిపోయి.. ‘ఖబద్దార్’ అని కేకేశారు. దానికి ఉలిక్కిపడిన చలపాయ్.. ఆ తరవాత షరతులతో కూడిన ‘సారీ’ చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి చలపాయ్ తన నోటి దురద ఏ పాటితో చూపించాడు.
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘గరుడ వేగ’ విడుదలకు సిద్దంగా ఉంది. థియేటరికల్ ట్రైలర్ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది. చలపాయ్ కూడా వచ్చాడు. రాజశేఖర్ మాట్లాడుతూ…’ఈ సినిమా దెబ్బకి నా మోకాళ్లు అరిగిపోయాయ్’ అంటూ తన కష్టాలు చెప్పుకోబోయాడు. ‘మోకాళ్లు అరిగితే ఎలా.. అది చాలా ఇంపార్టెంట్ కదా’ అన్నట్టు ఓ వెకిలి జోకేశాడు చలపాయ్. దాంతో చుట్టు ఉన్నవాళ్లు ఘొళ్లుమన్నారు. వేదికపై రాజశేఖర్ కూతుర్లున్నారు. వేదిక ముందు మహిళలున్నారు. మహిళా దర్శకురాలు జీవిత ఉంది. అయినా సరే… చలపాయ్ తన బుద్ది మార్చుకోలేదు. చలపాయ్ ఇప్పటికీ కంట్రోల్ లో ఉండకపోతే ఎలా..?? తన వైఖరి ఎప్పటికి మార్చుకొంటాడో ఏమో…??