జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు ఐదు కీలక శాఖలు ఇచ్చారు. సహాయ మంత్రులు కూడా ఉండరు. మొత్తం శాఖలను ఆయనే నిర్వహించాల్సి ఉంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలు పవన్ కల్యాణ్ చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా వికేంద్రీకరణ పాలన అందిస్తుంది. వైసీపీలో అంతా సజ్జల కేంద్రంగా ఉంటుంది. అన్ని మంత్రిత్వ శాఖల పనులు ఆయనే చేస్తారు. అసలు మంత్రులకు తమ శాఖల్లో వేలు పెట్టే అవకాశం ఉండదు. కనీస సమీక్ష చేయలేరు.
కానీ కూటమి ప్రభుత్వంలో మంత్రులంతా ఎవరి పని వారు చేయాల్సిందే. ఎవరూ జోక్యం చేసుకోరు. స్వతంత్రంగా తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయంలో చంద్రబాబు కూడా జోక్యం చేసుకోకపోవచ్చు. ఆయనకు ఆ శాఖల బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఆయన మార్క్ చూపిస్తారని.. చంద్రబాబు భావిస్తున్నారు. జోక్యం చేసుకున్నా పవన్ ఫీలవ్వొచ్చు. అందుకే ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చంద్రబాబు కూడా పవన్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు.
ఇప్పుడు పవన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. పంచాయతీరాజ్ గతంలో గొప్పగా పని చేసేది. సచివాలయాల వ్యవస్థ తెచ్చి పంచాయతీరాజ్ ను జగన్ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు గాడిన పెట్టుకోవాల్సి ఉంది. రూరల్ లో నీటి సమస్యను పరిష్కరిస్తే పవన్ గుర్తుండిపోతారు. అటవీ పర్యావరణానికి జగన్ హయాంలో జరిగిన విధ్వంసానికి విరుగుడు కనిపెట్టాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ అయినా ఇన్ స్టంట్గా సమస్యలు పరిష్కరించలేరు. మొదట నిర్ణయాలు తీసుకుని వాటిని క్రమబద్ధంగా అమలు చేసుకుంటూ వెళ్లాలి,. అప్పుడే ఫలితాలు వస్తాయి. పవన్ ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిద్దాం !