రాఫెల్ యుద్ధ విమానాల్లో… లక్ష కోట్ల స్కాం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. పార్లమెంట్ లోపల, బయట పోరాడుతున్నారు. ఆయన అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం.. రాహుల్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా… మిగతా అన్ని అంశాలను గంటల తరబడి… వివరిస్తోంది. ఇలా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విషయంలోనూ… చాట భారతం వినిపించారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ పార్టీ.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను నాశనం చేసింది.. ఆ సంస్థకు సామర్థ్యం లేకుండా చేసిందని అందుకే… రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగలేదు.. తమ ప్రభుత్వం వచ్చాక.. అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. లక్ష కోట్ల రూపాయల ఆర్డర్స్ ఇచ్చి హెచ్ఏఎల్ సామర్థ్యాన్ని పెంచామని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ఈ మాటే ఇప్పుడు.. మరోసారి కాంగ్రెస్, బీజేపీల మధ్య సవాళ్లకు దారి తీస్తోంది.
కేంద్ర రక్షణ మంత్రి… హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అసమర్థత మీద.. పార్లమెంట్ వేదికగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నప్పుడే.. ఆ సంస్థ.. అప్పుల్లో కూరుకుపోయిందని… జీతాలు ఇవ్వడానికి వెయ్యో.. రెండు వేల కోట్లో అప్పులు చేసిందనే వార్త బయటకు వచ్చింది. అదే సమయంలో చేయడానికి పనులు లేవని.. కాంట్రాక్టర్లు, ఆర్డర్లు లేవని.. కూడా.. ఆ వార్త సారాంశం. తాము లక్ష కోట్ల ఆర్డర్లు ఇచ్చామని.. ఓ వైపు పార్లమెంట్ వేదికగా… ప్రభుత్వం చెబుతున్న సమయంలో.. ఇలా రావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఊరుకుంటుంది..? నేరుగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే రంగంలోకి దిగారు. నిర్మలా సీతారామన్‌కు సవాల్ చేశారు.
పార్లమెంట్ లో ప్రకటించిన విధంగా… మోడీ ప్రభుత్వం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు లక్ష కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లుగా ఆధారాలు బయటపెట్టాలని.. లేకపోతే.. రాజీనామా చేయాలనేది.. రాహుల్ గాంధీ ప్రధాన డిమాండ్. దీనిపై… కాంగ్రెస్ పార్టీ అధినేత సవాల్ చేయడం.. దాన్ని అలా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో.. ఆయన పార్టీ సోషల్ మీడియా సక్సెస్ అయింది. ఇప్పుడిది హాట్ టాపిక్ అయింది. మరి పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని… నిజమేనని.. రాహుల్ గాంధీ సవాల్‌ను.. స్వీకరించి.. ఆధారాలు బయటపెడతారా..? రాఫెల్ డీల్ విషయలోనే.. రాహుల్ గాంధీ సైన్యాన్ని అవమానిస్తున్నారని చెప్పి తప్పిచుకుంటారా..