ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై ఎప్పుడూ లేనంత ఉత్కంఠ కనిపిస్తోంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ కోసం భారత్, కివీస్ జట్లు రెడీ అయ్యాయి. కివీస్ తో పోలిస్తే భారత్ బలంగా కనిపిస్తోంది. కానీ న్యూజిలాండ్ ఆటగాళ్లను తక్కువ అంచనా వేయలేం. రచిన్ రవీంద్ర ఇటీవలి కాలంలో మ్యాచ్ విన్నగా మారారు. తమదైన రోజున విలియమ్సన్ వంటి వాళ్లు చెలరేగిపోతారు.
భారత్ అప్రతిహత విజయాలతో ఫైనల్ కు వచ్చింది. నిజానికి ఇప్పటి వరకూ టోర్నీలో గట్టి సవాల్ భారత్ కు ఎదురుకాలేదు. పాకిస్తాన్ పై అయినా.. ఆస్ట్రేలియాపై అయినా ఆడుతూపాడుతూనే గెలిచారు. ఫైనల్లో కివీస్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ లు ముఖ్యంగా ఫైనల్స్ మ్యాచ్‌లు ఏకపక్షంగా జరిగితే నిస్సారంగా జరిగినట్లే. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మాత్రం అలా ఉండదని అంచనా వేస్తున్నారు.
పైనలో మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీకి గాయం కావడం భారత్ కు ఇబ్బందికరంగా మారింది. అయితే అది ఆడలేనంత పెద్దదా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. విరాట్ దూరం అయితే భారత్ ఓ అస్త్రాన్ని కోల్పోయినట్లే. అయినా ఆటగాళ్లు అంత అత్యుత్తమ ఫామ్ లో ఉన్నారు. దుబాయ్ స్టేడియంలో పిచ్‌లు స్పిన్ కు అనుకూలిస్తున్నాయి. భారత స్పిన్నర్లు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.