ఆర్జీవీని ఏపీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతారో లేదో కానీ ముంబై జైలుకు ఆయన వెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. లొంగిపోకుండా ఆయన తన శిక్షను రద్దు చేయాలని పై కోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు శిక్ష రద్దు చేయడం సంగతి పక్కన పెడితే ఎందుకు లొంగిపోలేదని ఫైర్ అయి.. వెంటనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కోర్టులో లొంగిపోయిన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది.
వర్మ ఇప్పుడు ముంబై పోయి అక్కడ జైల్లో లొంగిపోవాల్సిందే. ఆయనపై అదొక్కటే కాదు.. అధికారికంగా చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. వాటిపై విచారణ జరుగుతున్నాయి. అనధికారికంగా బాలీవుడ్ లో ఆయన చాలా మంది దగ్గర ఫైనాన్స్ తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన ముంబైలో బిచాణా ఎత్తేసి హైదరాబాద్ లో ఉంటున్నారని చెబుతారు. కారణం ఏదైనా ఆయన ముంబైకి వెళ్తే సెటిల్మెంట్ కోసం చాలా మంది ఆయన కోసం రెడీగా ఉంటారు.
న్యాయపరంగా ఆయనకు వెసులుబాటు లభించలేదు. ఇప్పుడు కోర్టులో ఆయన లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలి. ఒక వేళ కోర్టు జైలుకు వెళ్లాల్సిందే అంటే.. ముంబై జైల్లో ఆయన కాలం వెళ్లదీయాల్సి ఉంటుంది. ఈ లోపు ఇక్కడ ఏపీలో కేసుల్లో విచారణకు హాజరు కాకపోవడం వల్ల ఇక్కడ జైళ్లలో కూడా ఆయనకు ఏర్పాట్లు చేసి ఉంటారు. పాపాలు పండితే ఇలాగే అనుభవించాల్సి వస్తుందేమో ?