ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ పై ఈరోజు జనసేనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యలు అనిపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై విలేకరులు ప్రశ్నించగా, “టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ కు నొప్పి ఏంటి? పవన్ కళ్యాణ్ మాతో రాకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ను జగన్ తిడుతున్నాడు ” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అంతేకాకుండా బీజేపీ పై పోరాటానికి తమ తో పవన్ కళ్యాణ్ కూడా కలిసి రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. వైఎస్ఆర్ సీపీ నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుమ్మక్కు అయి ఉన్నారు అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన మళ్లీ తెరమీదకు తీసుకువచ్చారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.