వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ నుంచి… ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి ..తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. క్యాంపులు లాంటివేమీ ఏర్పాటు చేయడం లేదు కానీ.. తాత్కాలిక ప్రయోజనాలకో.. బెదిరింపులకో భయపడితే.. మాత్రం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అన్న సందేశాన్ని మాత్రం బలంగా పంపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీలకు సూటిగానే చెబుతున్నారు. 1984లో టీడీపీ నిర్వహించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న వారే తర్వాతి కాలంలో ప్రముఖ నేతలయ్యారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా.. అలాంటి ఉద్యమమే జరుగుతోందని.. మూడు రోజుల కిందట.. మండలిలో.. అమరావతి కోసం మద్దతుగా నిలబడిన వారికి వచ్చిన ప్రజాస్పందన ఎలా ఉందో.. గుర్తుంచుకోవాలంటున్నారు.
ఈ విషయంలో ఎమ్మెల్సీలను ఆయన అనుమానించడం లేదు. కానీ.. ఎప్పుడు ఎవరు.. ఎలా మారిపోతారో ..చంద్రబాబు కూడా అర్థం కాని పరిస్థితి. నిజానికి ఇప్పటికి ఎమ్మెల్సీలుగా ఉన్న 27 మంది .. సుదీర్ఘ కాలం నుంచి టీడీపీలో ఉన్నవారే. వారి సేవలకు గుర్తింపుగానే.. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఫిరాయింపులతో వచ్చిన వారికి… ఎమ్మెల్సీలు ఇస్తే.. వారు వెళ్లిపోయారు. డొక్కా, శివనాధ్ రెడ్డి ఇప్పటికే టీడీపీకి ఝులక్ ఇచ్చారు. మిగిలిన వారిలో అందరూ..టీడీపీ విధేయులే. కానీ.. జగన్ పార్టీకి ఇంకా నాలుగేళ్లకుపైగా.. అధికారం ఉంటూండటం.. పెద్ద మొత్తంలో ఆర్థిక లాభం… రాజకీయ భవిష్యత్ ను ఆశ చూపుతూండటంతో.. ఎమ్మెల్సీల్లో కొందరు ఊగిసలాటతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు కూడా.. తాను చెప్పాలనుకున్నది చెబుతున్నారు కానీ.. ఎవరిైనా నిఘా పెట్టడం …లాంటివి చేయడం లేదు. ఉంటే ఉన్నారు.. లేకపోతే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం.. టీడీపీకి విధేయంగా ఎంత మంది ఎమ్మెల్సీలు ఉంటారన్నదానిపైనే… మండలి భవితవ్యం కూడా తేలిపోనుంది.