హైదరాబాద్: ఈ నెల 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో నిర్వహించబోయే ఆయుత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును స్వయంగా ఆహ్వానించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు విజయవాడ వెళ్ళనున్నారు. రేపు బేగంపేట విమానాశ్రయంనుంచి 11.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడలోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయానికి కేసీఆర్ సతీ సమేతంగా వెళ్ళనున్నారు. దీనికోసం నిన్నే చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను లంచ్ చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవాడ చేరుకునే కేసీఆర్, చంద్రబాబును, ఏపీ మంత్రులను యాగానికి ఆహ్వానించిన తర్వాత అక్కడే లంచ్ చేసి 2 గంటలకు తిరిగి ఛాపర్లో హైదరాబాద్ బయలుదేరి వస్తారు. ఈ మధ్యలో కేసీఆర్ దుర్గగుడికి కూడా వెళ్ళే అవకాశముందని చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు, టీఆర్ఎస్లోకి టీడీపీ నేతల ఫిరాయింపుల నేపథ్యంలో చంద్రబాబు ఈ యాగానికి హాజరవుతారా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది