వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక నిర్ణయాలతో వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోతున్నాయని ఇలా అయితే రాష్ట్రం కోలుకోవడం కష్టం అవుతుందన్న ఉద్దేశంలో ఉన్న చంద్రబాబు… కేంద్రం, బీజేపీ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో.. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఉన్నత స్థాయి బృందాన్ని… ఢిల్లీకి పంపి.. కేంద్రమంత్రులతో… కుదిరితే ప్రధానమంత్రితోనూ భేటీ అయ్యేలా చూడాలనుకుంటున్నారు. అలాగే.. ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలంర్నీ కలిసి.. రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా… ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత కనిపిస్తోంది. మీడియా.. మరో మాట లేకుండా తుగ్లక్ నిర్ణయాలు అని కామెంట్ చేస్తోంది. చివరికి బీజేపీలో కూడా.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు పెద్దగా అనుకూలత లేదని.. ఆరెస్సెస్ అధికారిక పత్రికల్లో వస్తున్న ఆర్టికల్స్తోనే వెల్లడవుతోందంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై .. ప్రభావం చూపేలా… జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చడం లేదనేది చాలా మంది చెబుతున్నమాట. అయితే… ఏపీలో రాజకీయ అవసరాల కోసం… భవిష్యత్ రాజకీయాల కోసం… బీజేపీ దూకుడుగా ఎలాంటి స్టాండ్ తీసుకోలేని పరిస్థితి ఉంది. అందుకే.. జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదంటున్నారు.
ఈ విషయంలో టీడీపీ అధినేత బీజేపీ మనసు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న విధ్వంసం.. దేశానికి తీవ్ర నష్టం కలుగ చేస్తోందన్న విషయాన్ని … కేంద్రానికి, బీజేపీకి తెలియచెప్పాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే…జాతీయ స్థాయిలో… జగన్మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక పనులకు ఇప్పటికే… జాతీయ మీడియా కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చినందు వల్ల… తాము మరితంగా.. ఇక్కడి పరిస్థితుల్ని ఢిల్లీకి తీసుకెళ్తే ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.