మేఘా కృష్ణారెడ్డి తన స్వస్థలం కృష్ణాజిల్లా డోకిపర్రులో నిర్మించిన ఓ ఆలయం కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆ ఫోటోలు చూసి చాలా మంది టీడీపీ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిపై చాలా ఆరోపణలు చేశారని.. ఇప్పుడు ఇలా గుడి కార్యక్రమానికి వెళ్లడం ఏమిటని వారి వాదన. 2014-19 కాలంలో మేఘానికి కృష్ణారెడ్డి ఏపీలో చాలా ప్రాజెక్టులు చేపట్టారు. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేసింది మేఘానే. పోలవరానికి టెండర్ వేశారు కానీ రాలేదు.
ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి ఆత్మీయుడు. తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ పార్టీకి ఆయన అత్యంత ఆత్మీయుడు. ఎంత అంటే కాంట్రాక్టర్లకు మంజూరయ్యే బిల్లుల్లో సగానికిపైగా మేఘా కంపెనీకే వెళ్తాయని చెబుతారు. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎన్నెన్ని ఆరోపణలు చేసేవో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాయా?. విచిత్రంగా కేటీఆర్ మాత్రమే తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. కొడంగల్ లో ఓ ప్రాజెక్టు మేఘాకు మరో కంపెనీతో కలిసి దక్కితే విమర్శలు చేస్తున్నారు. మూసి ప్రాజెక్టు కూడా ఆ సంస్థే తీసుకుంటుందని అంటున్నారు. అవన్నీ ఆరోపణలు.
మేఘా కృష్ణారెడ్డి బేసిక్ గా కాంట్రాక్టర్. రివర్స్ టెండర్లకు ఆయన దక్కించుకున్న పనులు చేసి తీరాల్సిందే. లేకపోతే ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించినట్లుగా తప్పిస్తారు. ఇక్కడ పూర్తి కావాల్సింది పనులే కానీ.. కాంట్రాక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి కానీ..ప్రతీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటే ఎక్కువగా నష్టపోయేది ఆ పార్టీ..ఆ పార్టీ సానుభూతిపరులే.