నేడు తిరుమలేశుని సన్నిధిలో నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణల మనవడు దేవాన్ష్ అన్నప్రాసన వేడుక జరుగనున్నది.
Click Here for photos from Annaprasana (Sunday Oct 18th)
ఈ సందర్భంగా కొన్ని గత సంఘటనలు తలుచుకుంటే మధురంగా ఉంటాయి ,మనసుని మురిపిస్తాయి. ఈ ఆర్టికల్ క్రిందన ఇచ్చిన ఫొటోల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మురిసిపోతున్న వైనాన్ని చూడటానికి అభిమానులకు రెండు కళ్లూ చాలవు. అన్నగారి మురిపెం అంతా మనవరాలి అన్నప్రాసన కోసమే. నందమూరి బాలకృష్ణ, వసుంధరల ముద్దుల కుమార్తె బ్రాహ్మణి అన్నప్రాసన వేడుక నాటి ఫోటోలు అవి. ఏడుకొండల మీద కొలువుదీరిన తిరుమలేశ్వరుడి సమక్షంలో ఆ వేడుక జరిగింది. మనవరాలిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రేమగా అన్నగారు అన్నప్రాసన చేసిన వైనం కమనీయంగా ఉంది కదూ. అలాగే, మరో ఫొటోలో నారా చంద్రబాబునాయుడు, కూతురు భువనేశ్వరిల పుత్రరత్నం లోకేశ్ కి అన్నప్రాసన చేస్తున్న వైనం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఈ వేడుక జరిగింది.
కాలచక్రం వేగంగా తిరుగుతోంది. నాడు ఎన్టీఆర్ ఒళ్లో కూర్చోబెట్టుకుని అన్నప్రాసన చేసిన లోకేశ్, బ్రాహ్మణి నేడు దంపతులు.ఇప్పుడు వీరి కుమారుడు దేవాన్ష్ అన్నప్రాసన వేడుక జరగనుంది.నాడు తన తనయుడి కుమార్తెకు అన్నగారు తిరుమలలో అన్నప్రాసన చేశారు. నేడు బాలకృష్ణ తన తనయురాలి కుమారుడు దేవాన్ష్ అన్నప్రాసనను అదే ప్రాంగణంలో చేయనుండటం విశేషం. వెంకటేశ్వరుడి సన్నిధిలో ఆదివారం ఉదయం ఈ వేడుక వైభవంగా జరగనుంది. అటు నారా చంద్రబాబు నాయుడు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. బాలయ్య అప్పుడే తాత అయ్యారా? అనుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు తన మనవరాలు, మనవడి అన్నప్రాసన సమయంలో ఓ తాతగా ఎన్టీఆర్ ఎంతటి ఆనందాన్ని అనుభవించి ఉంటారో నేడు తన మనవడి అన్నప్రాసన వేడుకకు ఓ తాతగా బాలయ్య అంతే ఆనందాన్ని అనుభవిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ప్రజల గుండెల్లో ఓ ఆరాధ్య దైవంలా కొలువుదీరిన అన్నగార్ని ఎవరూ మర్చిపోలేరు. సాక్షాత్తు ఆయన మునిమనవడికి జరగబోతున్న ఈ వేడుక యావత్ నందమూరి అభిమానులకు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా నాటి అన్నగారి ఫొటోలు ఇలా చూడటం కూడా అమితానందానికి గురి చేసే విషయం
- Brahmini Annaprasana
- Brahmini Annaprasana
- Brahmini Annaprasana
- Brahmini Annaprasana
- Lokesh Annaprasana