మీరే నా సైన్యం అంటూ వాలంటీర్లపై ప్రేమ ఒలకబోసి.. వారిని బలి చేసే రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నారు. వాలంటీర్ల ఉద్యోగాలు ఉన్నాయో.. పోయాయో తెలియని విధంగా జగన్ ప్రకటలు చేస్తున్నారు. చాలా మంది వైసీపీనేతలు రాజీనామాలు చేయాలని .. మళ్లీ వైసీపీ రాగానే వాలంటీర్లుగా నియమిస్తామని ఒత్తిడి తెస్తున్నారు. వారిని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా కూర్చోబెట్టే ప్లాన్ చేసుకుంటున్నారు
ఈ వాలంటీర్లందరికీ చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేసేలా ఉండే వాలంటీర్లకు ఎలాంటి సమస్యా ఉండదని అంటున్నారు. అంతే కాదు.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల నెలకు రూ. యాభై వేల వరకూ సంపాదించుకునేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఉగాది రోజున.. వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలు చేస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయవద్దని ఆయన షరతు పెట్టారు. వారు చెప్పింది విని మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.
వాలంటీర్లలో చాలా మంది వైసీపీ కార్యకర్తలే. అయితే ప్రభుత్వ తీరు కారణంగా మెజార్టీ వ్యతిరేకమయ్యారు. ఐదేళ్లుగా తమ భవిష్యత్ వేస్ట్ అయిపోయిందని అనుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు .. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చూస్తారనుకుంటే.. చివరికి రాజీనామాలు చేయిస్తూండటం.. వారిలో అసంతృప్తిని పెంచుతోంది. మరో వైపు చంద్రబాబు బంపర్ ఆఫర్లు ఇస్తూ పోతున్నారు. ఈ క్రమంలో వాలంటీల్లో ఎంత శాతం మారినా అది టీడీపీకే అడ్వాంటేజ్ అవుతుంది.