అప్పట్లో అంటే.. 2005లో ..అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబుపై దాఖలైన అనేకానేక అవినీతి ఆరోపణల పిటిషన్లలో ఒకటి లక్ష్మిపార్వతి ఖాతాలో ఉంది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ.. ఆమె ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ పధ్నాలుగుపైగా విచారణ కమిటీలు నియమించారు. వాటిల్లో ఏమీ తేలలేదు. ఏసీబీ కోర్టులో విచారణ కూడా.. ఆగిపోయింది. కుట్రపూరితంగా.. ఏసీబీ విచారణ పిటిషన్ వేశారని.. కోర్టులో వాదించి చంద్రబాబు తరపు న్యాయవాదులు స్టే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ స్టే విషయంలో.. లక్ష్మిపార్వతి కూడా పట్టించుకోలేదు. కొద్ది రోజుల క్రితం.. ఆరు నెలలకు మించి స్టేలు ఉండటానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది.
అయితే.. చంద్రబాబు ఆ తర్వాత ఈ కేసు విచారణ విషయంలో స్టే తెచ్చుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో.. కొద్ది నెలల కిందట.. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు లక్ష్మిపార్వతికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలా.. మూసివేయాలా అని నేరుగా ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పడానికి లక్ష్మిపార్వతి సమయం తీసుకున్నారు. ఇప్పటికీ.. ఏ విషయం కోర్టుకు చెప్పలేదు. దీంతో లక్ష్మిపార్వతిని కోర్టుకు హాజరవ్వాలంటూ ఆదేశాలిచ్చారు. అది ఇప్పుడు మళ్లీ తెర ముందుకు వచ్చింది. లక్ష్మిపార్వతి ఇప్పుడు ఏసీబీ కోర్టు ముందుకు హాజరై.. తన పిటిషన్‌కు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
నిజానికి చంద్రబాబుపై అది కేసు కాదు. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ… ఆరోపిస్తూ.. విచారణ కోసం లక్ష్మిపార్వతి వేసిన ఓ పిటిషన్ మాత్రమే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తర్వాత.. ప్రాధమిక ఆధారాలంటే.. ఏసీబీ కోర్టు.. విచారణకు ఆదేశిస్తుంది. ఆ ప్రాధమిక ఆధారాలను ఇప్పుడు లక్ష్మిపార్వతి సమర్పించాల్సి ఉంటుంది. పత్రికల్లో వచ్చే కథనాలు.. వార్తలు ఆధారంగా పిటిషన్ వేసి ఉంటే.. కోర్టు అక్షింతలు వేసే అవకాశం ఉంది. పిటిషన్లో లక్ష్మిపార్వతి పేర్కొన్న అంశాలపై.. చాలా వరకూ ఇప్పటికే అనేక కమిటీలు.. విచారణ జరిపి ఏమీ తేల్చలేకపోయాయి. ఈ కారణంగానే గతంలో లక్ష్మిపార్వతి.. విచారణ కొనసాగింపుపై అనాసక్తిగా ఉన్నారంటున్నారు. లక్ష్మిపార్వతి ఇప్పుడు కోర్టుకు ముందుకు హాజరైతేనే… ఈ పిటిషన్‌పై విచారణ అర్హత తేలుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.