ఇది కౌరవసభ. అవమానించడానికే కుట్ర పూరితంగా అసెంబ్లీని నడుపుతున్నారని మళ్లీ సీఎంగానే సభకు వస్తానని చాలెంజ్ చేసి చంద్రబాబునాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ చాలెంజ్ లో గెలిచారు. సీఎంగానే సభలో అడుగు పెడుతున్నారు. అదీ కూడా బంపర్ మెజార్టీతో. తనను అవమానించిన వానమూకకు అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఘోరంగా ఓడిపోయి … అతి తక్కువ స్థానాలతో కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా అసెంబ్లీకి వస్తున్నారు. అది చంద్రబాబు సాధించిన అద్భుత విజయం.
2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించింది. ఆనాటి సమావేశంోల అసెంబ్లీలో తన భార్య గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టారు. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణిపై పాలక పక్ష సభ్యులు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడేందుకు స్పీకర్ చాన్స్ ఇవ్వలేదు. చంద్రబాబు మాట్లాడుతూండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. అయినా చాలెంజ్ చేసి వెళ్లారు. ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగాలను అణుచుకోలేకపోయారు.
కౌరవ సభను గౌరవసభగా చేసి అడుగుపెడతానని సవాల్ చేశారు. ఇప్పుడు అదే చేశారు. కౌరవలందర్నీ ప్రజా యుద్ధంలో ఓడించారు. అందరూ ఇంటికెళ్లిపోయారు. మరోసారి సభలో అడుగుపెట్టే హక్కును కోల్పోయారు., ఇప్పుడు తాను గౌరవ సభలో అడుగు పెడుతున్నారు. ఆయనను తట్టుకోలేని గెలిచిన కౌరవ పార్టీ సభ్యులు… వస్తారో రారో కూడాతెలియదు. వచ్చే ఉద్దేశంలో లేరని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే తాను చేసింది.. తనకు చేస్తారేమోనని భయం.