కేంద్రం ఈ నెల చివరి వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని సహా, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. బడ్జెట్ లో రాష్ట్రం పట్ల ఉదారస్వభావంతో వ్యవహరించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరనున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రమంత్రులకు వివరించి ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా ఏపీకి సాయం అందించాలని కోరనున్నారు.
ప్రధానంగా అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, రహదారుల మరమ్మతులు, పేదలకు ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు తదితర అంశాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
మొదటి రోజు చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్
ఉదయం 9 గంటలకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ
ఉదయం 10 :45గంటలకు ప్రధాని మోడీతో భేటీ
మధ్యాహ్నం 12 : 15గంటలకు రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం
మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ
2 : 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ
శుక్రవారం నాటి షెడ్యూల్
శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో భేటీ
10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం
10 : 45 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ
12 : 30గంటలకు మంత్రి అథవాలేతో సమావేశం
శుక్రవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని శనివారం విభజన సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు.