చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చాయని.. మూడు రోజులుగా హోరెత్తిపోతోంది. చంద్రబాబు కూడా.. వరుసగా రెండు రోజుల పాటు వీటిపై స్పందించారు. అయితే రాజకీయ కోణంలోనే.. ఈ నోటీసులకు… కేంద్రానికి ముడి పెట్టారు. విమర్శలు చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై.. శనివారం.. ఏజీతోనూ..ఇతర న్యాయనిపుణలతోనూ సమావేశమయ్యారు. ఇందులో వారెంట్లపై సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో బయటకు వచ్చాయి. అందులో ప్రధానమైది.. 2010 నాటి కేసు.. డిస్పోజల్ అని… కోర్టు వెబ్సైట్లో రాసి ఉండటం. అలా ఉన్నా.. వారెంట్లు ఎలా వస్తాయన్నది ప్రధాన సందేహం. అంతే కాదు… అసలు అధికారికంగా ఇంత వరకు.. వారెంట్లు ఏ ఒక్కరికీ అందలేదు. కేవలం మీడియాలో ప్రసారం అవుతున్న కాపీలపైనే ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
ఈ కేసు ఇప్పుడే తెరపైకి రావడానికి కారణమేమిటి..? 2010లో ధర్నాలో పాల్గొన్న రోజున 62మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఇప్పుడు పదహారు మందికే పరిమితం కావడం వెనుక ఉన్న లోగుట్టేమిటి..? నాడు తెలుగుదేశంలో ఉండి పార్టీ మారిన కీలక నేతల వివరాలు వారెంట్ల జాబితాలో లేకపోవడానికి కారణం ఏమిటి..? . అధికారికంగా నోటీసులు ఎందుకు పంపించలేదు..? ఇవన్నీ చంద్రబాబుతో పాటు … న్యాయనిపుణులకు వచ్చిన సందేహాలు. వారెంట్లపై రీకాల్ పిటీషన్ వేయడమా లేక, కోర్టుకు నేరుగా హాజరుకావడమా అనే అంశంపైనా చర్చలు జరుపుతున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఆ రోజు అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.
23వ తేదీన రాత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం అమెరికా పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ప్రకృతి వ్యవసాయం పై ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించాల్సి ఉంది. ఈ ప్రయాణానికి ప్రతిబందకాలు కల్పించేందుకే ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను తెరపైకి తీసుకువచ్చారని తెలుగుదేశం వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉన్న త స్థాయి వర్గాలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్తున్నందున… నిబంధనలేమీ అడ్డు కాదని చెబుతున్నారు. అయితే ఈ కేసు విషయంలో చంద్రబాబు అనుమానాలకు మాత్రం క్లారిటీ ఎప్పుడు వస్తుందో మరి..!