తెలంగాణలో టీడీపీ నిస్తేజమయింది. అయితే చంద్రబాబు పట్టు వదలన్నట్లుగా ఉంటున్నారు. తాజాగా ఆయన పార్టీ నేతలతో సమావేశం పెట్టి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రముఖ నేతలంతా పార్టీని వీడారు . పార్టీలో ఉన్న సీనియర్లు సైలెంట్గ ాుంటున్నారు. పార్టీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు ఉన్నా నేతలు లేకపోవడంతో ఉనికి కనిపించడం లేదు. యువ నేతల్ని ప్రోత్సహిస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని సలహాలిస్తున్నారు.
కొత్తగా తెలంగాణలో సభ్యత్వం కూడా ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ తరహాలో ఆన్లైన్ డిజిటల్ సభ్యత్వాన్ని ప్రారంభించనున్నారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జులను నియమించే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా బలంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేయాలని చూస్ున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పదింటిలో పోటీ చేసేందుకు కొంత మంది నేతలు ఆసక్తి చూపించారు.
తెలంగాణకు సంబంధించినంత వరకూ మినీ మహానాడు నిర్వహించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు. మహానాడుతో రాష్ట్రంలోని పార్టీనేతలందరినీ ఒకే వేదికపైకి తెచ్చి పునర్ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో టీడీపీనే తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేసిందని టీఆర్ఎస్కు టీడీపీనే ప్రత్యామ్నాయంగా రూపొందించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ పుంజుకోవడం అంటే అద్భుతమేనని ఎక్కువ మంది అభిప్రాయం.