తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీలో ఉన్న ప్రముఖ ఆలయాలను కుటంబసభ్యులతో సహా దర్శించుకుంటున్నారు. శుక్రవారం తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకుంటారు. శనివారం విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. డిసెంబర్ 3న విశాఖ వెళ్లనున్నారు. అదే రోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు కుటుంబం దర్శించుకోనుంది.
ఆధారాలు లేని స్కిల్ కేసులో ఏకంగా 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. ఈ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కోర్టు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.
క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. వాటికి విచారణ అర్హత కూడా ఉండదు. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం.. అన్ని కేసుల్లో విచారణలు దాదాపుగా పూర్తయినందున.. తీర్పులు వెల్లడించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబును రాజకీయానికి దూరం చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి పన్నాగాలు వర్కవుట్ అవుతాయా లేదా అన్న క్వాష్ పిటిషన్ పై తీర్పును బట్టి వెల్లడయ్యే అవకాశం ఉంది.